Post Office Scheme : పోస్టాఫీస్ MIS రిటర్న్స్.. భార్యాభర్తలకు అద్భుతమైన పథకం.. ఇలా పెట్టుబడి పెడితే నెలకు రూ. 9,250 సంపాదించవచ్చు..!

Post Office Scheme : ఈ పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (POMIS)లో జంటగా పెట్టుబడి పెడితే ప్రతినెలా రూ. 9,250 వరకు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

Post Office Scheme : పోస్టాఫీస్ MIS రిటర్న్స్.. భార్యాభర్తలకు అద్భుతమైన పథకం.. ఇలా పెట్టుబడి పెడితే నెలకు రూ. 9,250 సంపాదించవచ్చు..!

Post Office Scheme

Updated On : June 25, 2025 / 2:03 PM IST

Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన సేవింగ్ స్కీమ్ అందుబాటులో ఉంది. మీరు దంపతులైతే (Post Office Scheme) ఇంకా మంచిది. సురక్షితమైన ఆదాయం కోసం పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS)లో పెట్టుబడి పెట్టండి. అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. వివాహం తర్వాత కలిసి ఆర్థిక భవిష్యత్తును స్థిరంగా ఉంచుకోవచ్చు.

ప్రభుత్వం ప్రత్యేకించి దంపతుల కోసం ఈ పథకాన్ని రూపొందించింది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా స్థిర మొత్తాన్ని పొందవచ్చు. మీ ఇంటి ఖర్చులకు లేదా ఇతర అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. ఇంతకీ ఆ పథకం పేరు ఏంటి? ఆదాయపరంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also :  EPFO : ఈపీఎఫ్ఓ సభ్యులకు బిగ్ రిలీఫ్.. PF ఆటో క్లెయిమ్ లిమిట్ రూ. 5 లక్షలకు పెంపు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS) ఏంటి? :
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది ప్రతి నెలా స్థిర వడ్డీ మొత్తాన్ని అందించే సేవింగ్ స్కీమ్. సురక్షితమైన పెట్టుబడులలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకంలో ముఖ్యమైన ఫీచర్ సింగిల్ లేదా జాయింట్ అకౌంట్లు రెండూ ఓపెన్ చేయొచ్చు. దంపతులు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే.. ఎక్కువ డబ్బు జమ చేయవచ్చు. ప్రతి నెలా ఎక్కువ వడ్డీని పొందవచ్చు.

వడ్డీ రేటు, పెట్టుబడి పరిమితి :

  • ప్రస్తుత వడ్డీ రేటు : సంవత్సరానికి 7.4 శాతం
  • మెచ్యూరిటీ : 5 ఏళ్లు (మెచ్యూరిటీ తర్వాత పొడిగించవచ్చు).
  • సింగిల్ అకౌంటులో పెట్టుబడి పరిమితి : రూ. 9 లక్షలు.
  • జాయింట్ అకౌంటులో పెట్టుబడి పరిమితి : రూ. 15 లక్షలు.
  • కనీస పెట్టుబడి : రూ. 1,000.

జాయింట్ అకౌంటులో అన్ని ఖాతాదారులకు సమాన వాటాలు ఉంటాయి. వడ్డీ కూడా సమానంగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసి భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక మొత్తంలో నెలవారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

ప్రతి నెలా వచ్చే ఆదాయం ఎంతంటే? :

  • ప్రతి నెలా POMIS నుంచి భారీ మొత్తంలో ఆదాయం పొందవచ్చు..
  • రూ. 15 లక్షల జాయింట్ అకౌంటుపై వార్షిక వడ్డీ : రూ. 1,11,000 (రూ. 15లక్షలు x 7.4 శాతం)
  • నెలవారీ ఆదాయం : సుమారు రూ. 9,250 ( రూ. 1,11,000 / 12 నెలలు)
  • రూ. 9 లక్షల ఒకే అకౌంటుపై వార్షిక వడ్డీ : రూ. 66,600 (రూ. 9లక్షలు x 7.4 శాతం)
  • నెలవారీ ఆదాయం : సుమారు రూ. 5,550 (రూ. 66,600 / 12 నెలలు)

మీ జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే.. ప్రతి నెలా రూ. 9,250 వరకు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు, ఇంటి ఖర్చులు లేదా ఇతర అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెలా మీ అకౌంట్లలోకి డబ్బు జమ అవుతుంటుంది.

Read Also : Motorola Edge 50 Ultra : ఇలా కొన్నారంటే.. ఈ మోటోరోలా Ultra ఫోన్ జస్ట్ రూ. 23వేలకే.. క్రేజీ డీల్ డోంట్ మిస్..!

ఈ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు? :

  • POMIS అకౌంట్ ఓపెన్ చేసేందుకు కొన్ని అర్హతలు అవసరం
  • 18 ఏళ్లు పైబడిన ఏ వ్యక్తి అయినా సింగిల్ అకౌంట్ తీసుకోవచ్చు.
  • గరిష్టంగా ముగ్గురు పెద్దలు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. (జాయింట్ A లేదా జాయింట్ B టైప్ అకౌంట్ ).
  • తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కూడా మైనర్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
  • 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు తమ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS) పెట్టుబడి అత్యంత ఆకర్షణీయమైనది. ప్రభుత్వ పథకం కావడంతో పూర్తిగా సురక్షితం. మీ పెట్టుబడికి ప్రభుత్వం హామీ లభిస్తుంది. ఎలాంటి రిస్క్ ఉండదు.
రాబడి స్థిరంగా ఉంటుంది. ప్రతి నెలా డబ్బులు వస్తాయి.

భార్యాభర్తలకు ఎక్కువ ప్రయోజనాలు :
దంపతులకు కలిసి ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. అధిక ప్రయోజనాలను పొందవచ్చు, తద్వారా కుటుంబ ఆర్థిక భద్రత పెరుగుతుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా అకౌంట్ కొనసాగించవచ్చు. ఎక్కువ రోజులు నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు.