Motorola Edge 50 Ultra : ఇలా కొన్నారంటే.. ఈ మోటోరోలా Ultra ఫోన్ జస్ట్ రూ. 23వేలకే.. క్రేజీ డీల్ డోంట్ మిస్..!
Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 Ultra
Motorola Edge 50 Ultra : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ధర మళ్లీ తగ్గిందోచ్.. ఈ మోటోరోలా ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు లాంచ్ ధర కన్నా చాలా (Motorola Edge 50 Ultra) తక్కువ ధరకే లభ్యమవుతోంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.
గత ఏడాదిలో వచ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్ తర్వాత భారీగా తగ్గింది. అసలు లాంచ్ ధర రూ. 23వేల కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో 12GB ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంది. ఇంతకీ ఈ మోటోరోలా ఫోన్ డీల్ ఎలా పొందాలంటే..?
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.59,999 నుంచి రూ.49,999కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రూ.48వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.13వేల ధరకు లభిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.36,999కు పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, వివిధ బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు (Motorola Edge 50 Ultra) :
ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ నార్డిక్ వుడ్, పీచ్ ఫజ్ వీగన్ లెదర్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. ప్రత్యేకమైన స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది. 6.7-అంగుళాల సూపర్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. pOLED ప్యానెల్‌తో కర్వడ్ డిజైన్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే HDR10+ సర్టిఫైడ్, 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
2800 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌కు సపోర్టు ఇచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ బ్యాక్ సైడ్ మల్టీఫేస్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 64MP థర్డ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లు కూడా మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, డ్యూయల్ 5G సిమ్ కార్డ్‌లకు సపోర్టు చేస్తుంది.