EPFO : ఈపీఎఫ్ఓ సభ్యులకు బిగ్ రిలీఫ్.. PF ఆటో క్లెయిమ్ లిమిట్ రూ. 5 లక్షలకు పెంపు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
EPFO : ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ లిమిట్ 5 రెట్లు పెంచింది. అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను సులభతరం చేసింది.

EPFO auto settlement
EPFO : ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ ఆటో క్లెయిమ్ లిమిట్ ఏకంగా 5 రెట్లు పెరిగింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రావిడెంట్ ఫండ్ (PF) ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.
గతంలో ఈ ఆటో క్లెయిమ్ లిమిట్ రూ. లక్ష ఉండేది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమయ్యే ఈపీఎఫ్ఓ సభ్యులకు భారీ ఉపశమనం కలిగించనుంది. COVID-19 మహమ్మారి సమయంలో ఈపీఎఫ్ఓ మొదట ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
తద్వారా సభ్యులు తమ ఫండ్స్ నుంచి ఎలాంటి ఆలస్యం లేకుండా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లిమిట్ 5 రెట్లు పెంచడం ద్వారా సంస్థ ఈపీఎఫ్ సభ్యులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. వైద్య అత్యవసర పరిస్థితిల్లో కూడా త్వరగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఆటో క్లెయిమ్ ప్రాసెస్ ఇలా.. EPFO :
ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సౌకర్యం కోసం UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) యాక్టివ్‌గా ఉండాలి. మీ కేవైసీ వివరాలైన ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్, పాన్ కార్డులను ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో అప్‌డేట్ చేసి ధృవీకరించాలి. వైద్య, ప్రకృతి వైపరీత్యాలు వంటి క్లెయిమ్‌లకు ఆటో సెటిల్‌మెంట్ ప్రక్రియను వినియోగించుకోవచ్చు.
- EPFO అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి UAN నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- “Online Services” ట్యాబ్‌కు వెళ్లి “Claim (ఫారం-31, 19, 10C & 10D)” పై క్లిక్ చేయండి.
- బ్యాంక్ అకౌంట్ ధృవీకరించి “Proceed for Online Claim”కి వెళ్లి ఫారం-31 ఎంచుకోండి.
- రీజన్ ఎంచుకుని మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- ఏదైనా డాక్యుమెంట్ అవసరమైతే అప్‌లోడ్ చేసి సమర్పించండి.
- ఇప్పుడు మీరు “Track Claim Status” కేటగిరీలో మీ క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
ఏప్రిల్ 2025లో 19.14 లక్షల మంది కొత్త సభ్యులు EPFO :
ఏప్రిల్ 2025లో ఈపీఎఫ్ఓ నికరంగా 19.14 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. మార్చి 2025 కన్నా 31.31శాతం ఎక్కువ. ఏప్రిల్ 2024 కన్నా 1.17 శాతం ఎక్కువ. ఈ నివేదిక ప్రకారం.. 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సు యువత ఈపీఎఫ్ఓలో చేరారు. ఈ వయస్సులో 4.89 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. మొత్తం కొత్త సభ్యులలో 57.67శాతంగా ఉంది. గతంలో ఈపీఎఫ్ఓ నుంచి నిష్క్రమించిన దాదాపు 15.77 లక్షల మంది పాత సభ్యులు తిరిగి చేరారు.