Poco F7 5G : గేమర్లకు పండగే.. భారీ 7550mAh బ్యాటరీతో కొత్త పోకో గేమింగ్ 5G ఫోన్.. పవర్‌ఫుల్ ఫీచర్లు కేక.. ధర ఎంతంటే?

Poco F7 5G : భారత్ సహా ప్రపంచ మార్కెట్లో పోకో F7 5G లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 7550mAh బ్యాటరీ, 12GB RAM ఉన్నాయి.

Poco F7 5G : గేమర్లకు పండగే.. భారీ 7550mAh బ్యాటరీతో కొత్త పోకో గేమింగ్ 5G ఫోన్.. పవర్‌ఫుల్ ఫీచర్లు కేక.. ధర ఎంతంటే?

Poco F7 5G

Updated On : June 25, 2025 / 11:13 AM IST

Poco F7 5G : గేమింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. పోకో నుంచి సరికొత్త గేమింగ్ 5G ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ బ్రాండ్ 7,550mAh అతిపెద్ద బ్యాటరీతో లాంచ్ అయింది. భారత్ సహా ప్రపంచ మార్కెట్లో లభ్యం కానుంది. కొత్త పోకో F7 5G గత ఏడాది పోకో F6 5Gకి అప్‌గ్రేడ్‌ వెర్షన్. పోకో ఫోన్ ప్రారంభ ధర రూ. 29,999 నుంచి అందుబాటులో ఉండనుంది.

పోకో F7 55 ధర ఎంతంటే? :
పోకో F7 5G ఫోన్ 256GB స్టోరేజ్‌తో 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో 12GB ర్యామ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 31,999గా ఉంటుంది. హై వేరియంట్ ధర రూ. 33,999గా ఉంటుంది. జూలై 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. రూ. 2వేలు వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ పోకో ఫోన్ కోసం ప్రీ-బుకింగ్ జూన్ 25న ప్రారంభమైంది. ఫ్రాస్ట్ వైట్, సైబర్ సిల్వర్ ఎడిషన్ మరియు ఫాంటమ్ బ్లాక్ అనే 3 స్టైలిష్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

పోకో F7 5G స్పెసిఫికేషన్లు :
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB LPDDR5X ర్యామ్ కలిగి ఉంది. UFS 4.1తో 512GB వరకు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఫోన్ 6000mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ సెషన్‌ల సమయంలో కూల్ ఉండేలా చేస్తుంది. అదనంగా, ర్యామ్ 12GB వరకు విస్తరించవచ్చు.

Read Also : Tecno Spark Go 2 : AI ఫీచర్లతో టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ అదుర్స్.. నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేయొచ్చు.. ధర కూడా చాలా తక్కువే..!

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15పై షావోమీ HyperOS 2తో రన్ అవుతుంది. పోకో 4 ఏళ్ల OS అప్‌డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందవచ్చు. ఆకట్టుకునే IP రేటింగ్‌లతో (IP66, IP68, IP69) కూడా వస్తుంది. పోకో ఫోన్ సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉంది. కేవలం 7.98mm, 222 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. లేటెస్ట్ Wi-Fi 7, బ్లూటూత్ 6 సపోర్టు ఇస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. పోకో F7 5G బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 7,550mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. 90W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 22.5W రివర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది.

ఈ పోకో ఫోన్ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. HDR10+ సపోర్ట్, 3,200 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.