Tecno Spark Go 2 : AI ఫీచర్లతో టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ అదుర్స్.. నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేయొచ్చు.. ధర కూడా చాలా తక్కువే..!
Tecno Spark Go 2 : టెక్నో కొత్త ఫోన్ చూశారా? నెట్‌వర్క్ లేకుండానే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.. ధర కేవలం రూ. 7వేలు మాత్రమే..

Tecno Spark Go 2
Tecno Spark Go 2 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? టెక్నో ఇండియా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. బడ్జెట్ కేటగిరీలో టెక్నో స్పార్క్ గో 2 వచ్చేసింది. ఈ ఫోన్ (Tecno Spark Go 2) టెక్నో ఇన్-హౌస్ ఏఐ అసిస్టెంట్ ఎల్లా అమర్చి ఉంది.
కంటెంట్‌ను రీ రైట్ చేయడం, రీరైటింగ్, ఇమేజ్ క్రియేటింగ్, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీ పరిష్కరించగలదు. మల్టీ ఇండియన్ లాంగ్వేజీలకు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
టెక్నో స్పార్క్ గో 2 ధర :
టెక్నో స్పార్క్ గో 2 ఫోన్ ఇంక్ బ్లాక్, వీల్ వైట్, టైటానియం గ్రే, టర్కోయిస్ గ్రీన్ అనే 4 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 1 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
టెక్నో స్పార్క్ గో 2 స్పెసిఫికేషన్లు :
స్పార్క్ గో 2 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పంచ్ హోల్ HD+ IPS LCD డిస్‌ప్లే కలిగి ఉంది. హుడ్ కింద Unisoc T7250 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
ఫొటోగ్రఫీ పరంగా.. ఈ స్మార్ట్‌ఫోన్ 13MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. 4G, Wi-Fi, బ్లూటూత్ సపోర్టు కలిగి ఉంది. 15W ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. నాలుగు ఏళ్ల వరకు లాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు కూడా వినియోగదారులు ఈజీగా కాల్స్ చేసుకోవచ్చు. స్పెషల్ ఫ్రీ లింక్ యాప్.. ఈ సింపుల్ యాక్టివిటీతో స్పార్క్ గో 2 డివైజ్‌ల మధ్య స్పార్క్ గో 2, పోవా సిరీస్ ఫోన్ల మధ్య పనిచేస్తుంది.
వివో ఇండియా కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కూడా ప్రవేశపెట్టింది. ధర రూ. 10వేలు లోపు ధరకే కొనేసుకోవచ్చు. వివో T4 లైట్ కంపెనీ T4 సిరీస్‌లో లేటెస్ట్ ఫోన్. ఈ వివో ఫోన్ 8GB ర్యామ్, 6000mAh బ్యాటరీతో స్పెసిఫికేషన్లు కలిగి ఉంది.