Vivo T4 Lite 5G : వివో కొత్త 5G ఫోన్ భలే ఉందిగా.. అతి చౌకైన ధరకే వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం..!

Vivo T4 Lite 5G : అతి చౌకైన ధరకే వివో కొత్త T4 లైట్ 5G ఫోన్ లాంచ్.. జూలై 2న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.

Vivo T4 Lite 5G : వివో కొత్త 5G ఫోన్ భలే ఉందిగా.. అతి చౌకైన ధరకే వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం..!

Vivo T4 Lite 5G

Updated On : June 24, 2025 / 5:21 PM IST

Vivo T4 Lite 5G : వివో లవర్స్ కోసం కొత్త 5G ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో రూ.10వేల కన్నా తక్కువ ధరకే వివో T4 లైట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ (Vivo T4 Lite 5G) అయింది. ఇప్పటికే మార్కెట్లో వివో నుంచి T4, T4 అల్ట్రా, T4x ఉన్నాయి. చైనీస్ కంపెనీ ఈ 5G ఫోన్ 8GB ర్యామ్, భారీ 6000mAh బ్యాటరీతో సహా అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వివో T4 5G టోన్-డౌన్ వెర్షన్‌గా వచ్చింది.

Read Also : PM Kisan Update : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20విడత విడుదలపై ఉత్కంఠ.. ఈ 4 పనులు చేయకపోతే రూ. 2వేలు పడవు..!

ఈ బ్రాండ్ 2 ఏళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. వచ్చే వారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్రిజం బ్లూ, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. వివో T4 లైట్ 5G స్పెసిఫికేషన్లు, ధర, లభ్యతకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్‌‌లో వివో T4 లైట్ 5G ధర, ఆఫర్లు :
వివో T4 లైట్ ఫోన్‌ మొత్తం 3 స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందిస్తుంది. వివో T4 5G బేస్ (4GB + 128GB) ట్రిమ్ ధర రూ.9,999, 6GB + 128GB మిడ్ వేరియంట్ ధర రూ.10,999, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.12,999కు పొందవచ్చు.

జూలై 2 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్‌ వంటి ఎంపిక చేసిన రిటైల్ ఛానల్ నుంచి ఈ వివో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్, SBI, Axis బ్యాంక్ కార్డులతో వినియోగదారులు రూ.500 డిస్కౌంట్ పొందవచ్చు.

వివో T4 లైట్ 5G స్పెసిఫికేషన్లు :
వివో T4 లైట్ 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ను పొందుతుంది. 1,000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని పొందుతుంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు LPDDR4x ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో (1TB వరకు విస్తరణ) వస్తుంది.

ఈ వివో ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS15తో వస్తుంది. వివో 5G ఫోన్ మిలిటరీ-గ్రేడ్ (MIL-STD-810H)తో పాటు దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు IP64 రేటింగ్‌ కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP బ్యాక్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.

Read Also : HDFC Credit Card : బిగ్ అలర్ట్.. HDFC క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. జూలై 1 నుంచి ఛార్జీల బాదుడే.. ఏయే పేమెంట్లపై ఛార్జీ ఎంతంటే?

జూలై 2న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. వివో అధికారిక ఇ-స్టోర్, వివిధ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

వివో T4 లైట్ 5G ధర :
4 జీబీ ర్యామ్ + 128 జీబీ రూ. 9,999
6 జీబీ ర్యామ్ + 128 జీబీ రూ.10,999
8 జీబీ ర్యామ్ + 256 జీబీ రూ.12,999