HDFC Credit Card : బిగ్ అలర్ట్.. HDFC క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. జూలై 1 నుంచి ఛార్జీల బాదుడే.. ఏయే పేమెంట్లపై ఛార్జీ ఎంతంటే?
HDFC Credit Card : HDFC క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి..

HDFC Credit Card
HDFC Credit Card : HDFC బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మీరు హెచ్ఎడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తుంటే ఇది మీకోసమే.. HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లకు కార్డుల (HDFC Credit Card) వాడకంపై కొత్త ఛార్జీలు, రివార్డ్ పాయింట్లు వర్తిస్తాయి. ఈ కొత్త రూల్స్ జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి.
ఈ కొత్త రూల్స్ ఆన్‌లైన్ గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ బిల్లులు, అద్దె, ఇంధనం, ఎడ్యుకేషన్ పేమెంట్లపై ప్రభావితం చేస్తాయి. అయితే, ఏయే లావాదేవీలపై ఎంత ఛార్జీ విధిస్తారు? రివార్డ్ పాయింట్లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. ఆన్‌లైన్ స్కిల్ బేసడ్ గేమింగ్‌పై ఛార్జీలు :
మీరు Dream11, MPL, Rummy Culture, Junglee Games వంటి ప్లాట్‌ఫామ్‌లపై నెలకు రూ.10వేల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే.. బ్యాంక్ ఒక శాతం వసూలు చేస్తుంది. గేమింగ్‌పై ఎలాంటి రివార్డ్ పాయింట్లు రావు.
2. వాలెట్ లోడింగ్ పై ఛార్జీలు :
మీ క్రెడిట్ కార్డుతో ఒక నెలలో రూ. 10వేల కన్నా ఎక్కువ మొత్తాన్ని PayTM, Mobikwik, Freecharge, Ola Money వంటి థర్డ్ పార్టీ వాలెట్‌లోకి లోడ్ చేస్తే ఒక శాతం ఛార్జ్ విధిస్తారు.
3. యుటిలిటీ బిల్లులపై అదనపు ఛార్జీలు :
మీ క్రెడిట్ కార్డుతో ఒక నెలలో రూ. 50వేలు (కన్స్యూమర్ కార్డ్) లేదా రూ. 75వేలు (బిజినెస్ కార్డ్) కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే.. యుటిలిటీ బిల్లుపై ఒక శాతం ఛార్జ్ విధిస్తారు. ఈ ఛార్జ్ కూడా రూ. 4,999కి పరిమితం. బీమా చెల్లింపుపై ఎలాంటి ఛార్జీలు ఉండవు.
4. అద్దె, ఇంధనం, ఎడ్యుకేషన్ పేమెంట్లపై ఛార్జీలు :
అద్దె చెల్లింపులపై ఒక శాతం ఛార్జీ గత మాదిరిగానే ఉంటుంది. గరిష్టంగా రూ. 4,999 ఉంటుంది. ఖర్చు రూ. 15వేలు లేదా రూ. 30వేలు దాటినప్పుడు మాత్రమే ఇంధన లావాదేవీలపై ఒక శాతం ఛార్జీ విధిస్తారు. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా పేమెంట్లు చేసినప్పుడు మాత్రమే ఎడ్యుకేషన్ రుసుములపై ఒక శాతం ఛార్జీ విధిస్తారు. స్కూల్ లేదా కాలేజీ వెబ్‌సైట్ లేదా POS మెషిన్ ద్వారా చేసే పేమెంట్లపై ఎలాంటి ఛార్జీ ఉండదు.
5. బీమా లావాదేవీలపై రివార్డ్ పాయింట్ క్యాప్ :
బీమా లావాదేవీలపై ఇప్పుడు రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. కానీ, లిమిటెడ్ మాత్రమే. గత రివార్డ్ క్యాపింగ్ మిలీనియా, UPI, స్విగ్గీ, పేటీఎం, భారత్ వంటి కార్డులపై వర్తిస్తుంది. మారియట్ బోన్‌వాయ్ కార్డ్‌పై బీమా చెల్లిస్తే రివార్డ్ పాయింట్లపై ఎలాంటి పరిమితి ఉండదు.
HDFC కార్డ్ కస్టమర్‌లు జూలై 1కి ముందు తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని క్రెడిట్ కార్డును ఉపయోగించాలి. అదనపు ఛార్జీలు పడకుండా ఉండేలా మీ రివార్డ్ పాయింట్లను సద్వినియోగం చేసుకోవచ్చు.