SIM Card Name : మీ ఆధార్‌తో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఎవరైనా మీ పేరుతో సిమ్ వాడితే ఇట్టే తెలుసుకోవచ్చు?

SIM Card Name : మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయో తెలుసా? మీ పేరుతో ఎవరైనా వాడితే ఇట్టే తెలుసుకోవచ్చు..

SIM Card Name : మీ ఆధార్‌తో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఎవరైనా మీ పేరుతో సిమ్ వాడితే ఇట్టే తెలుసుకోవచ్చు?

SIM Card Name

Updated On : June 24, 2025 / 4:00 PM IST

SIM Card Name : మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? గత కొన్ని ఏళ్లుగా సిమ్ కార్డ్ మోసాల సంఖ్య పెరుగుతోంది. స్కామర్లు (SIM Card Name) మీ వ్యక్తిగత డేటాకు సంబంధించి వివరాలను దొంగిలిస్తున్నారు.

మీకు తెలియకుండానే ఎవరైనా మీ UID నంబర్‌ను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) TAFCOP వ్యవస్థ కింద సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఒక టూల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also : Vivo X200 FE : ఈ వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. అద్భుతమైన ఫీచర్లతో వివో X200 FE ఫోన్ వచ్చేస్తోంది..

వినియోగదారులు తమ పేరుతో ఎన్ని సిమ్‌లు రిజిస్టర్ అయ్యాయో సులభంగా తెలుసుకోవచ్చు. భారత ప్రభుత్వం ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్‌ లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దేశమంతటా 9 యాక్టివ్ సిమ్‌లతో ఒక ఆధార్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు. జమ్మూకాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో 6 గరిష్టంగా ఉంటాయి. మీ మొబైల్ నంబర్‌కు ఎన్ని సిమ్ కార్డులు రిజిస్టర్ అయ్యాయో మీరు ఎలా ఇలా ఈజీగా చెక్ చేయొచ్చు.

ఆధార్ లింక్ సిమ్ కార్డులను ఎలా చెక్ చేయాలి? (SIM Card Name) :

  • సంచార్ సాథి పోర్టల్‌ (sancharsaathi.gov.in)కి వెళ్లండి.
  • హోం పేజీలో, ‘Citizen Centric Services’ సెక్షన్‌కు వెళ్లి, ‘Know Your Mobile Connections’పై ట్యాప్ చేయండి.
  • మీ 10-అంకెల మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. అది ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత, ఆధార్ ఐడీతో రిజిస్టర్ అయిన అన్ని మొబైల్ నంబర్ల లిస్టు మీకు కనిపిస్తుంది.

గుర్తు తెలియని మొబైల్ నెంబర్లను ఎలా డిలీట్ చేయాలి? :
మీకు తెలియని నంబర్ కనిపిస్తే.. డిస్‌కనెక్ట్ చేయాలి. “Not My Number” అని ఫ్లాగ్ చేయవచ్చు లేదా మీ పాత సిమ్ ఉంటే “Not Required” అని ఫ్లాగ్ చేయవచ్చు. ఆ తర్వాత మీ రిపోర్టు ఆధారంగా నంబర్‌లు ఇన్ యాక్టివ్ అవుతాయి. మీ పేరు మీద 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులు రిజిస్టర్ చేసుకున్న వారికి SMS ద్వారా నోటిఫికేషన్ వస్తుంది.