PM Kisan Update : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20విడత విడుదలపై ఉత్కంఠ.. ఈ 4 పనులు చేయకపోతే రూ. 2వేలు పడవు..!
PM Kisan Update : పీఎం కిసాన్ 20వ విడత రూ. 2వేలు అతి త్వరలో విడుదల కానుంది. లబ్ధిదారు రైతులు తప్పనిసరిగా ఈ పనులను పూర్తి చేయండి. లేదంటే డబ్బులు రావు..

PM Kisan 20th installment
PM Kisan Update : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) పథకం 20వ విడత కోసం ఆసక్తిగా (PM Kisan Update) ఎదురుచూస్తున్నారు.
ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు 3 విడతలుగా వార్షికంగా రూ. 6వేలు ఆర్థిక సాయం అందుతుంది. రైతులు ప్రతి 4 నెలలకు వారి బ్యాంకు ఖాతాలో రూ. 2వేలు జమ అవుతుంది. ఈ నగదును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) కింద పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారు రైతులకు 19 విడతలు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జూన్ నెలాఖరు నాటికి ప్రభుత్వం 20వ విడతను విడుదల చేస్తుందని అంచనా. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, విడత ప్రకటనకు ముందు, రైతులు ఈ 4 పనులను తప్పక పూర్తి చేయాలి. లేదంటే రూ. 2వేలు మీ అకౌంటులో పడవు.
Read Also : Vivo X200 FE : ఈ వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. అద్భుతమైన ఫీచర్లతో వివో X200 FE ఫోన్ వచ్చేస్తోంది..
రూ. 2వేల కోసం ముందుగా ఈ 4 పనులను పూర్తి చేయండి :
1. మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌కు లింక్ చేయండి.
పీఎం కిసాన్ యోజన మొత్తం ఆధార్-లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు పంపుతారు. మీ బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయకపోతే.. వెంటనే బ్యాంకుకు వెళ్లండి. ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి.. లేదంటే రావాల్సిన రూ. 2వేలు అకౌంటులో జమ కావు.
2. e-KYC తప్పనిసరి :
ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ e-KYC తప్పనిసరి చేసింది. e-KYC లేకుంటే.. మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు.
3 విధాలుగా e-KYC పూర్తి చేయొచ్చు :
OTP ఆధారిత e-KYC : ఆధార్ మొబైల్‌కు లింక్ చేసి పీఎం కిసాన్ పోర్టల్‌లో OTPతో ధృవీకరించండి.
బయోమెట్రిక్ ఈ-కేవైసీ : సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి మీ ఫింగర్ ఫ్రింట్స్ ఐడెంటిటీ కోసం ఇవ్వొచ్చు.
సీనియర్ సిటిజన్లు, వికలాంగులైన రైతులకు CSCలో ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా e-KYC సౌకర్యం అందుబాటులో ఉంది.
3. భూమి రికార్డులను వెరిఫై చేయండి :
వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన అందుబాటులో ఉంది. మీ భూమి డాక్యుమెంట్లు సరిగ్గా లేకున్నా లేదా ఆధార్ లేదా పీఎం కిసాన్ ఐడీ లింక్ చేయకపోతే.. రూ. 2వేలు పడవు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు భూమి ధృవీకరణ చేయించుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.
4. మీ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేయండి :
- రైతులు తమ ఇళ్ల నుంచి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
- అధికారిక (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- మీ స్టేటస్ తెలుసుకోండి లేదా లబ్ధిదారుని స్టేటస్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- పేరు స్పెల్లింగ్, IFSC కోడ్, అకౌంట్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను కచ్చితంగా చెక్ చేయండి.
20వ విడత ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్ 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. ఇప్పుడు ప్రభుత్వం 20వ విడతను జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.