Vivo V40 Pro 5G : బంపర్ ఆఫర్ భయ్యా.. భారీగా తగ్గిన వివో 5G ఫోన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Vivo V40 Pro 5G : అమెజాన్ ఆఫర్ అదిరింది.. వివో V40 ప్రో 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo V40 Pro 5G

Vivo V40 Pro 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. అతి తక్కువ ధరకే వివో V40 ప్రో 5G లభిస్తోంది. మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే (Vivo V40 Pro 5G) ఇదే సరైన సమయం.. రూ. 36వేల బడ్జెట్ లోపు ధరలో ఈ అద్భుతమైన కెమెరా ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

లాస్ట్ జనరేషన్ మోడల్ 5G ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో సరసమైన ధరకు అందుబాటులో ఉంది. వివో V40 ప్రో 5G ఫోన్ రూ.49,999కి లాంచ్ కాగా ఇప్పుడు రూ.36,999 లోపు లభ్యమవుతుంది. Zeiss-ట్యూన్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌తో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్, డిస్‌ప్లేను కూడా అందిస్తుంది. అమెజాన్‌లో వివో V40 ప్రో 5G ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో వివో V40 ప్రో 5G ధర :
ప్రస్తుతం వివో V40 ప్రో 5G ఫోన్ రూ. 36,999కు అందుబాటులో ఉంది. లాంచ్ ధర కన్నా రూ. 13వేలు భారీ తగ్గింపు అందిస్తోంది. HDFC, OneCard, IDFC వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై వినియోగదారులు రూ. వెయ్యి తగ్గింపును కూడా పొందవచ్చు.

Read Also : RailOne App : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ‘రైల్‌వన్’ సూపర్ యాప్ ఆగయా.. టికెట్ బుకింగ్ నుంచి PNR స్టేటస్ వరకు అన్నీ ఒకేచోట..!

మీరు నెలకు రూ. 1,794 నుంచి ఈఎంఐతో ఈజీగా వివో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ట్రేడ్-ఇన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వివో ఫోన్ వర్కింగ్ కండిషన్లు, ఇతర అంశాలను బట్టి రూ. 35.050 వరకు వాల్యూను పొందవచ్చు. కస్టమర్లు అదనంగా చెల్లించడం ద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీ, మొత్తం మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్లను పొందవచ్చు.

వివో V40 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
వివో V40 ప్రో 5G ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ప్రారంభమైంది. HDR10+ సపోర్ట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9200+ చిప్‌సెట్‌తో సపోర్టు ఇస్తుంది.

ఈ వివో ఫోన్ 5,500mAh, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. IP68 సర్టిఫికేషన్‌ను కూడా అందిస్తుంది. కెమెరా సెగ్మంట్‌లో ఈ వివో ఫోన్ 50MP ప్రైమరీ షూటర్‌తో పాటు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన Zeiss ట్యూన్ చేసిన 50MP టెలిఫోటో లెన్స్‌ను అందిస్తుంది. 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో కూడా వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ వివో ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది.