RailOne App : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ‘రైల్‌వన్’ సూపర్ యాప్ ఆగయా.. టికెట్ బుకింగ్ నుంచి PNR స్టేటస్ వరకు అన్నీ ఒకేచోట..!
RailOne App : రైల్వే సూపర్ యాప్ టికెట్ బుకింగ్, PNR స్టేటస్ చెక్, టికెట్ రీఫండ్, ఫుడ్ ఆర్డర్ చేయడం వంటి అనేక సర్వీసులను అందిస్తుంది.

RailOne App
RailOne App : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై టిక్కెట్ల బుకింగ్ కోసం ఇతర యాప్స్‌పై ఆధారపడాల్సిన పనిలేదు. జనరల్ టిక్కెట్లను బుకింగ్, రిజర్వేషన్ కోసం రైల్ కనెక్ట్ యాప్, రైలు (RailOne App) స్టేటస్ చెక్ చేసేందుకు ప్రత్యేక యాప్ అవసరం లేదు. భారత రైల్వే కొత్త ఆల్-ఇన్-వన్ యాప్ ‘రైల్‌వన్’ ప్రవేశపెట్టింది.
ఈ సూపర్ యాప్ సాయంతో రైల్వే ప్రయాణికులు ఇప్పుడు అన్ని రైలు బుకింగ్ సర్వీసులను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో యాక్సస్ చేయొచ్చు. రైల్ వన్ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) డెవలప్ చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికుల కోసం ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ రైల్ వన్ యాప్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రైల్ వన్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, PNR స్టేటస్ చెక్, టికెట్ రీఫండ్, ఫుడ్ ఆర్డర్ చేయడం వంటి అనేక సర్వీసులను పొందవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. గత ఫిబ్రవరిలో స్వారైల్ యాప్ మాదిరిగా బీటా వెర్షన్‌లో ప్రవేశపెట్టగా అదే యాప్ ఇప్పుడు ఫైనల్ వెర్షన్ రిలీజ్ చేసింది.
రైల్‌వన్ యాప్ స్పెషల్ ఫీచర్లు :
రైల్వేల టెక్నికల్ బ్రాంచ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) రైల్‌వన్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాలేషన్ తర్వాత వినియోగదారులు తమ ప్రస్తుత (RailConnect) లేదా (UTSonMobile) లాగిన్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చు.
- రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ టికెట్ బుకింగ్
- ప్లాట్‌ఫామ్ టికెట్ బుకింగ్.
- PNR స్టేటస్ చెకింగ్
- రైల్వే స్టేషన్‌లో కోచ్ లొకేషన్ డేటా
- సరుకు, పార్శిల్ డెలివరీ ఎంక్వైరీ
రియల్ టైమ్ రైలు ట్రాకింగ్ :
రైల్‌వన్ యాప్ ద్వారా ప్రయాణికులు తమ రైలు లైవ్ స్టేటస్, రాక సమయం, ఆలస్యం సమాచారం, ఇతర ముఖ్యమైన అప్‌డేట్స్ పొందవచ్చు. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. రైల్‌వన్ యాప్ ద్వారా రైల్ మదద్ సర్వీసును కూడా పొందవచ్చు. తద్వారా ప్రయాణీకులు తమ ఫిర్యాదులను రిజిస్టర్ చేసుకోవచ్చు. కంప్లయింట్ స్టేటస్ కూడా ట్రాక్ చేయవచ్చు.
అలాగే, యాప్‌లో తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఒక ఆప్షన్ కూడా ఉంది. ప్రయాణ సమయంలో రైలులో ఆహారాన్ని ఆర్డర్ చేసే సౌకర్యం కూడా రైల్‌వన్ యాప్ ద్వారా అందుబాటులో ఉంది. ప్రయాణీకులు యాప్ ద్వారా పార్టనర్ డీలర్ల నుంచి తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు.
🚨#RailOne App of Indian Railways is now LIVE!📱
RailOne is a one-stop solution for all passenger services. The App offers ease of access for services like ⬇️
✦ Reserved & Unreserved Tickets
✦ Platform Tickets
✦ Enquiries about Trains
✦ PNR
✦ Journey Planning
✦ Rail Madad… pic.twitter.com/rtorI0cREO— PIB India (@PIB_India) July 1, 2025
రీఫండ్, పేమెంట్ సౌకర్యం :
ఏదైనా కారణాల వల్ల మీ ప్రయాణం రద్దు అవ్వడం లేదా మిస్ అయినా ప్రయాణీకులు నేరుగా రైల్ వన్ యాప్ నుంచి రీఫండ్ కోసం అభ్యర్థించవచ్చు. పేమెంట్ మరింత సులభతరం చేసేలా R-Wallet సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
మల్టీ లాంగ్వేజీ, సింగిల్ సైన్-ఆన్ (SSO) సపోర్టు :
రైల్ వన్ యాప్ మల్టీ లాంగ్వేజీ సపోర్టు అందిస్తుంది. సింగిల్ సైన్-ఆన్ (SSO) సిస్టమ్ కలిగి ఉంది. తద్వారా వినియోగదారులు తమ RailOne ఆధారాలను ఉపయోగించి ఐఆర్‌సీటీసీ రైలు కనెక్ట్, UTS మొబైల్ యాప్ వంటి ఇతర రైల్వే యాప్‌లకు లాగిన్ అవ్వవచ్చు. లాగిన్ కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా m-PIN ఆప్షన్ కూడా ఉంది.
రైల్‌వన్ యాప్ డౌన్‌లోడ్ ఎలా :
రైల్‌వన్ యాప్ ఆండ్రాయిడ్ (గూగుల్ ప్లే స్టోర్), iOS (ఆపిల్ యాప్ స్టోర్) రెండింటిలోనూ ఉచితంగా పొందవచ్చు. మీరు యాప్‌ను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకుని సైన్ ఇన్ అవ్వొచ్చు. ఈ అప్లికేషన్ R-Wallet (రైల్వే ఇ-వాలెట్) యాక్టివిటీని కలిగి ఉంది. వినియోగదారులు mPIN, బయోమెట్రిక్ లాగిన్ ఆప్షన్ల ద్వారా తమ అకౌంట్లను యాక్సెస్ చేయవచ్చు.
అడ్వాన్స్ చార్ట్ తయారీ (8 గంటల ముందు) :
* ప్రస్తుత చార్ట్‌లు బయలుదేరే 4 గంటల ముందు రెడీ అవుతాయి.
* రైలు బయలుదేరే ముందు 8 గంటలకు పొడిగించాలి
* మధ్యాహ్నం 2 గంటలకు ముందు రైళ్ల కోసం ముందు రోజు రాత్రి 9 గంటలకు చార్ట్‌లు ఖరారు
* ప్రయాణీకులకు ముందుగానే వెయిట్‌లిస్ట్ స్టేటస్ అప్‌డేట్స్
తత్కాల్ బుకింగ్‌ల కోసం ఆధార్ వెరిఫికేషన్ :
* జూలై 1, 2025 నుంచి తత్కాల్ బుకింగ్‌ల కోసం వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే అనుమతి
* జూలై చివరి నాటికి OTP అథెంటకేషన్ అమల్లోకి
* ఆధార్ లేదా డిజిలాకర్ డాక్యుమెంట్ల ద్వారా అథెంటికేషన్