Vivo V60e Review
Vivo V60e Review : వివో కొత్త ఫోన్ వారికి అద్భుతమైన న్యూస్.. గత అక్టోబర్ 7న భారత మార్కెట్లో లాంచ్ అయిన వివో V60e ఫోన్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వివో 5G ఫోన్‌లో భారీ క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే పెద్ద అడ్వాంటేజ్.. కెమెరా ఫీచర్లలో 200MP మెయిన్ కెమెరా అత్యంత ఆకర్షణమైన ఫీచర్ అని చెప్పొచ్చు.
పర్ఫార్మెన్స్ విషయంలో అసలు చెప్పనక్కర్లేదు.. మీడియాటెక్ డైమన్షిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో వచ్చింది. ఈ ఫోన్‌లో మీరు 3 ఏళ్ల OS అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా పొందవచ్చు. 6500mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్ కూడా కలిగి ఉంది. 90W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వివో V60e ఫోన్ ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
వివో V60e 5జీ ఫోన్ 6500mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 3 రోజుల పాటు భారీగా ఫోన్ వాడినా కూడా ఒక రోజు వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ వేగంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో వస్తుంది.
మీకు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ఈ ఫోన్ 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ద్వారా కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్‌ను లైట్ పర్పల్, నోబుల్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో పొందవచ్చు.
డిస్‌ప్లే :
వివో V60e ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB లేదా 12GB LPDDR4X ర్యామ్, 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS15పై రన్ అవుతుంది.
Vivo V60e Review
బ్రాండ్ ఈ ఫోన్‌తో 3 ఏళ్ల OS అప్‌డేట్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. మీ ఫోన్‌లో భారీ గేమింగ్ కోసం చూస్తుంటే మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి హై-ఎండ్ టాస్కుల కోసం మీరు ఈ వివో ఫోన్ తీసుకోవచ్చు.
వివో V60e 5G ఫోన్ బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 200MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ పొందవచ్చు. అయితే ఫ్రంట్ సైడ్ మీరు IAFతో 50MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. మీరు ఏఐ ఆరా లైట్ పోర్ట్రెయిట్, ఏఐ ఫెస్టివల్ పోర్ట్రెయిట్ ఏఐ ఫోర్ సీజన్ పోర్ట్రెయిట్ వంటి అనేక కెమెరా ఫీచర్లను అందిస్తుంది.
వివో V60e 5G ఫోన్ బేస్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999కు లభ్యమవుతుంది.