Vivo X100 Price Drop
Vivo X100 Price Drop : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్.. అతి తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో (Vivo X100 Price Drop) గత ఏడాదిలో వివో X100 ఫోన్ రూ. 10,010కు పైగా ధర తగ్గింది.
రూ. 63,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ వివో ఫోన్ పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్, కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆకట్టుకునే కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. 8T LTPO అమోల్డ్ డిస్‌ప్లే, IP68-రేటెడ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో X100 డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో వివో X100 ధర ఎంతంటే? :
ప్రస్తుతం వివో X100 5G ఫోన్ రూ.52,980కి (Vivo X100 Price Drop) అమ్ముడవుతోంది. లాంచ్ ధర రూ.63,999 నుంచి రూ.10,010 తగ్గింది. అదనంగా, యాక్సిస్ బ్యాంక్, IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.750 తగ్గింపు పొందవచ్చు. దాంతో అసలు ధర రూ.52,130కి తగ్గుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.4వేల వరకు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై నెలకు రూ.1,863 నుంచి ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. ఈ డీల్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లపై మాత్రమే అందుబాటులో ఉంది.
వివో X100 స్పెసిఫికేషన్లు :
వివో X100 5G ఫోన్ అద్భుతమైన 6.78-అంగుళాల కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. హుడ్ కింద, ఈ డివైజ్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్, V3 ఇమేజింగ్ చిప్‌తో 12GB ర్యామ్ వేరియంట్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. వివో X100 ఫోన్ ZEISS-ట్యూన్ 50MP సోనీ IMX920 ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్, 100x డిజిటల్ జూమ్‌తో 64MP టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14పై రన్ అవుతుంది. అదనంగా, వివో X100 ఫోన్ 120W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh బ్యాటరీతో వస్తుంది.