Post Office RD Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. ప్రతిరోజు రూ. 100 డిపాజిట్ చేస్తే చాలు.. కేవలం 5 ఏళ్లలో ఎన్ని లక్షలు సంపాదిస్తారంటే?

Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ఈ RD స్కీమ్ ద్వారా రూ. 100 పెట్టుబడితో రూ.2,14,097 లక్షలు సంపాదించుకోవచ్చు.

Post Office RD Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. ప్రతిరోజు రూ. 100 డిపాజిట్ చేస్తే చాలు.. కేవలం 5 ఏళ్లలో ఎన్ని లక్షలు సంపాదిస్తారంటే?

Post Office RD Scheme

Updated On : July 28, 2025 / 6:43 PM IST

Post Office RD Scheme : పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? ఎందులో పెట్టుబడి పెడితే అద్భుతమైన రాబడిని పొందవచ్చో తెలుసా? బ్యాంకులతోపాటు పోస్టాఫీసులో (Post Office RD Scheme) కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సాధారణంగా బ్యాంకులు, పోస్టాఫీసులలో RD (రికరింగ్ డిపాజిట్) పథకం అందుబాటులో ఉంది. ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. పిగ్గీ బ్యాంకులో ఎలాంటి వడ్డీని అందించనప్పటికీ మీరు డబ్బును మాత్రమే సేవ్ చేస్తారు.

మీరు ఆర్‌డీలో పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ తర్వాత మీకు వడ్డీతో సహా భారీగా రాబడి వస్తుంది. చిన్నపాటి సేవింగ్స్ చేసేందుకు ఇష్టపడే వారికి ఈ స్కీమ్ అద్భుతంగా ఉంటుంది. మీరు పోస్టాఫీస్ RD పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి 5 ఏళ్లకు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ రూ. 100 ఆదా చేసి పెట్టుబడి పెడితే చాలు.. 5 ఏళ్లలో రూ. 2,14,097 సంపాదించుకోవచ్చు.

రూ. 2 లక్షల, 14,097 రాబడి :
ప్రతిరోజూ రూ. 100 డిపాజిట్ చేయడం ద్వారా మీరు నెలకు రూ. 3వేలు ఆదా చేస్తారు. ప్రతి నెలా రూ. 3వేలు చొప్పున పోస్టాఫీస్ RD పథకంలో పెట్టుబడి పెట్టాలి. ప్రతి ఏటా రూ. 36వేలు అయితే, 5 ఏళ్లలో మొత్తం రూ. 1,80,000 పెట్టుబడి పెడతారు.

ప్రస్తుతం, ఈ RD పథకం 6.7శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 5 ఏళ్లలో వడ్డీగా రూ. 34,097 సంపాదిస్తారు. మెచ్యూరిటీపై రూ. 2,14,097 రాబడి అందుకుంటారు. చిన్న మొత్తాల్లో సేవ్ చేసి భారీగా కూడబెట్టుకోవచ్చు. పోస్టాఫీసు వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం.. కేవలం రూ. 100తో RD అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎంత పెట్టుబడి పెట్టాలి అనేదానిపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు.

Read Also : BSN Recharge Plans : కస్టమర్లకు గుడ్ న్యూస్.. BSNL 3 లాంగ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 45 రోజుల వ్యాలిడిటీ.. కేవలం రూ. 249 మాత్రమే..!

RD స్కీమ్ పొడిగింపు ఇలా.. :
మీరు 5 ఏళ్ల తర్వాత కూడా RD పథకం నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. అవసరమైతే మరో 5 ఏళ్లు RD పొడిగించవచ్చు. మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వర్తించే అదే వడ్డీ రేటు పొడిగింపు సమయంలో కూడా వర్తిస్తుంది. పొడిగించిన రికరింగ్ డిపాజిట్ అకౌంట్ పొడిగింపు కాలంలో ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు.

RD అకౌంట్ వడ్డీ రేటు పూర్తి సంవత్సరాలకు వర్తిస్తుంది. ఒక ఏడాది కన్నా తక్కువ కాలానికి సేవింగ్ అకౌంట్ రేటు ప్రకారం వడ్డీ పొందవచ్చు. ఉదాహరణకు.. మీరు పొడిగించిన అకౌంట్ 2 ఏళ్ల 6 నెలల తర్వాత క్లోజ్ చేస్తే.. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ రేటు ప్రకారం.. మొదటి 2 ఏళ్లకు 6.7శాతం, మిగిలిన 6 నెలలకు 4శాతం వడ్డీ లభిస్తుంది.

మెచ్యూరిటీకి ముందు అకౌంట్ క్లోజింగ్ రూల్స్ :
మీరు పోస్టాఫీస్ RD అకౌంట్ 5 ఏళ్ల ముందు క్లోజ్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 3 ఏళ్ల తర్వాత క్లోజ్ చేయవచ్చు. మీరు మెచ్యూరిటీ తేదీకి ఒక రోజు ముందు అకౌంట్ క్లోజ్ చేస్తే.. వడ్డీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంటు అందించే వడ్డీ రేటుకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం 4శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పోస్టాఫీసులో ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టేముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి. ఆ తర్వాతే పెట్టుబడి పెట్టండి.