Vodafone-idea (Vi) : దేశరాజధానికి ముందుగా వోడాఫోన్ ఐడియా 5G సేవలు.. Vi యూజర్లకు మెసేజ్‌లు.. మిగతా నగరాల్లో ఎప్పుడంటే?

Vodafone-idea (Vi) : భారత మార్కెట్లోకి అతి త్వరలో 5G సర్వీసులు రానున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) ఈ నెలాఖరులో 5G సేవలను ప్రారంభించనున్నాయి.

Vodafone-idea (Vi) : భారత మార్కెట్లోకి అతి త్వరలో 5G సర్వీసులు రానున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) ఈ నెలాఖరులో 5G సేవలను ప్రారంభించనున్నాయి. మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ Vi (Vodafone-idea) కూడా తన 5G సేవలను అతి త్వరలో ప్రారంభించనుంది. అయితే Vi కంపెనీ ముందుగా ఢిల్లీ NCR ప్రాంతంలోని యూజర్లకు 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. 5G సర్వీసులకు సంబంధించి ఇప్పటివరకూ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Vi ఇటీవల 5G నెట్‌వర్క్‌కు సంబంధించి అవసరమైన డివైజ్‌ల కోసం నోకియా (Nokia) ఎరిక్సన్ (Sony Ericsson) వంటి గ్లోబల్ లీడర్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఢిల్లీ NCRలో 5G సేవల గురించి చాలా మంది Vi యూజర్లకు కంపెనీ మెసేజ్‌లను పంపుతోంది. ఆ మెసేజ్‌లో “Good News Vi నెట్‌వర్క్ 5Gకి అప్‌గ్రేడ్ కానుంది. మీ నెట్‌వర్క్ అనుభవం ఇప్పుడు మరింత మెరుగ్గా ఉంటుంది. అతి త్వరలో మీరు మా Vi నెట్‌వర్క్‌తో ఢిల్లీ-NCRలో మెరుగైన కవరేజీ, సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీసులను పొందుతారు’’ అని ఉంది. 5G లాంచ్‌కు సంబంధించిన నిర్దిష్ట తేదీ లేదా టైమ్‌లైన్‌ను Vi కంపెనీ వెల్లడించలేదు.

Vodafone-idea (Vi) 5G services will be available in Delhi NCR soon

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) భారతదేశంలో 5G సేవలు ఊహించిన దానికంటే త్వరగా ప్రారంభమవుతాయని అన్నారు. అదనంగా 5G స్పీడ్ 4G కంటే కనీసం 10 రెట్లు వేగంగా పనిచేస్తుందని మోదీ చెప్పారు. నివేదికల ప్రకారం.. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) ఈ నెలాఖరులో 5G సేవలను ప్రారంభించనున్నాయి. లాంచ్ టైమ్‌లైన్ గురించి టెలికాం కంపెనీలు వివరాలను వెల్లడించలేదు. సెప్టెంబర్ 29న జరగనున్న కంపెనీ AGMలో Jio తమ (5G Services) ప్రారంభించే అవకాశం ఉంది.

Airtel కూడా 5G సేవలను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్‌లో లాంచ్ చేస్తుందని తెలిపింది. మొదటి దశలో 5G సర్వీసులు 13 నగరాలకు చేరుకుంటాయని చెప్పారు. ఈ నగరాల్లో ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, అహ్మదాబాద్, గురుగ్రామ్, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో ఉన్నాయి. ఈ నగరాల్లో కూడా 5G పరిమిత ప్రాంతాల్లో కొన్ని వారాలు లేదా నెలల తర్వాత పూర్తి స్థాయిలో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also : Airtel 5G Services : 5G ఫోన్ ఉన్నా ఎయిర్‌టెల్ యూజర్లందరికి 5G సేవలు కష్టమే.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు