Volkswagen Tiguan R-Line
Volkswagen Tiguan R-Line : కొత్త కారు కోసం చూస్తున్నారా? ఏప్రిల్ 14న భారత మార్కెట్లోకి వోక్స్‌వ్యాగన్ నుంచి సరికొత్త టిగువాన్ ఆర్ లైన్ కారు వచ్చేస్తోంది. టిగువాన్ ఆర్-లైన్ కారు కోసం ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
వోక్స్‌వ్యాగన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ సరికొత్త టిగువాన్ ఆర్-లైన్ కలర్ ఆప్షన్లు, ఫీచర్ల వివరాలను వెల్లడించింది. ఆసక్తిగల కస్టమర్లు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లను విజిట్ చేయడం ద్వారా తమ బుకింగ్‌లను చేసుకోవచ్చు.
వోక్స్వ్యాగన్ టిగువాన్ R-లైన్ కలర్ ఆప్షన్లు :
వోక్స్‌వ్యాగన్ అధికారిక వెబ్‌సైట్‌లో టిగువాన్ ఆర్-లైన్ కలర్ ఆప్షన్లను వెల్లడించింది. పెర్సిమోన్ రెడ్ మెటాలిక్, సిప్రెస్సినో గ్రీన్ మెటాలిక్, నైట్‌షేడ్ బ్లూ మెటాలిక్, గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్, మదర్ ఆఫ్ పెర్ల్ ఎఫెక్ట్‌తో ఓరిక్స్ వైట్, ఓయిస్టర్ సిల్వర్ మెటాలిక్‌లలో అందుబాటులో ఉంటుంది.
వోక్స్వ్యాగన్ టిగువాన్ R-లైన్ ఇంజిన్, పవర్ట్రెయిన్ :
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ 2.0-లీటర్ 4 సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, VW 4మోషన్ AWD సిస్టమ్‌తో వస్తుంది. వరుసగా 204HP, 320Nm గరిష్ట శక్తిని, టార్క్ అవుట్‌పుట్‌ను అందించగలదు. టిగువాన్ R-లైన్ కారు గంటకు 229 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుందని, 7.1 సెకన్లలో 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వోక్స్‌వ్యాగన్ పేర్కొంది.
Volkswagen Tiguan R-Line
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ ఫీచర్లు :
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. కొత్త జనరేషన్ DCC (డైనమిక్ ఛాసిస్ కంట్రోల్) ప్రోను పొందుతుంది. వెహికల్ డైనమిక్స్ మేనేజర్, వెహికల్ డైనమిక్స్ మేనేజర్, వీల్-స్పెసిఫిక్ బ్రేకింగ్, షాక్ అబ్జార్బర్ డంపింగ్ వీల్-సెలెక్టివ్ అడ్జెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్-టర్న్ ఆప్షన్, క్యాబిన్ సౌకర్యం వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది.
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్.. సెక్యూరిటీ ఫీచర్లు :
టిగువాన్ ఆర్-లైన్ సేఫ్టీ సూట్‌లో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు, సైడ్ అసిస్ట్, (రియర్ ట్రాఫిక్ అలర్ట్‌తో సహా లేన్ చేంజ్ అసిస్ట్), ఫ్రంట్ అసిస్ట్ (ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్), లేన్ అసిస్ట్ (లేన్ కీపింగ్ సిస్టమ్), పార్క్ అసిస్ట్ ప్లస్, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC) వంటి 21 లెవెల్ 2 ADAS ఫీచర్లు ఉన్నాయి.
వోక్స్వ్యాగన్ టిగువాన్ R-లైన్ ధర (అంచనా) :
వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ కచ్చితమైన ధర త్వరలో వెల్లడి కానుంది. అయితే, CBU మోడల్‌గా దిగుమతి చేయనుంది. R-లైన్ ప్రీమియం ధర సుమారు రూ. 50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.