Voltas Diwali Dhamaka
Voltas Diwali Dhamaka : కొత్త ఏసీ, రిఫ్రిజిరేటర్ లేదా వాషింగ్ మిషన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే అద్భుతమైన సమయం. పండగ సీజన్ సందర్భంగా వోల్టాస్ వార్షిక దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు సహా వైడ్ రేంజ్ హోం అప్లియన్సెస్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
అనేక ప్రొడక్టులు ప్రారంభ ధర కన్నా చాలా తక్కువ (Voltas Diwali Dhamaka) ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా, కంపెనీ దీపావళి ఆఫర్‌లో భాగంగా ఈజీ ఈఎంఐ ఆప్షన్లన కూడా అందిస్తోంది. తద్వారా వినియోగదారులు నెలకు రూ.1,088 కన్నా తక్కువ ధరకే హోం అప్లియన్సెస్ కొనుగోలు చేయవచ్చు.
వోల్టాస్ పండుగ ఆఫర్లు :
వోల్టాస్ దీపావళి సేల్ ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తుంది. అందులో జీరో డౌన్ పేమెంట్, జీరో వడ్డీ, క్యాష్‌బ్యాక్ ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోళ్లపై రూ.6వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కంపెనీ ఏసీలు, వాటర్ హీటర్లు వంటి ప్రొడక్టులపై ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌ను కూడా అందిస్తోంది. అయితే, ఈ ప్రత్యేక ఆఫర్ ఎంపిక చేసిన ఏసీ సిరీస్, గీజర్ మోడళ్లకు మాత్రమే పరిమితంగా ఉంటుంది.
వోల్టాస్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు
ఏసీ ఆఫర్లు :
వోల్టాస్ 1.5-టన్ ఇన్వర్టర్ ఏసీపై రూ.31,300 భారీ తగ్గింపు పొందవచ్చు. సాధారణంగా రూ.69,990కి అమ్ముడయ్యే ఈ 5-స్టార్ రేటింగ్ ఏసీని ఈ సేల్ సమయంలో రూ.38,690కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఇన్వర్టర్ ఏసీ అడ్జస్టబుల్ ఇన్వర్టర్ ఫంక్షన్, హై యాంబియంట్ కూలింగ్, సూపర్ డ్రై మోడ్, టర్బో కూలింగ్ వంటి అడ్వాన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.
రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు :
వోల్టాస్ బెకో సిరీస్ 230-లీటర్ డబుల్-డోర్ రిఫ్రిజిరేటర్ అసలు ధర కన్నా రూ.12,897 తక్కువకు లభిస్తుంది. సాధారణంగా రూ.42,990 ఖరీదు చేసే 3-స్టార్ రేటింగ్ మోడల్ డిస్కౌంట్‌తో రూ.30,093కి కొనుగోలు చేయవచ్చు. అదనపు బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇతర హోం అప్లియన్సెస్ :
వోల్టాస్ వాషింగ్ మెషీన్లు రూ.20,990 నుంచి ప్రారంభమవుతాయి. కంపెనీ వాషింగ్ మెషీన్లు, ఇతర అప్లియన్సెస్ దాదాపు సగం ధరకే విక్రయిస్తోంది. వోల్టాస్ మైక్రోవేవ్‌లు ప్రారంభ ధర రూ.4,990 నుంచి ప్రారంభమవుతాయి. డిష్‌వాషర్ రేంజ్ రూ.19,990 నుంచి ప్రారంభమవుతుంది.