Volvo EX60 EV (Image Credit To Original Source)
Volvo EX60 EV : కొత్త ఏఐ కారు వచ్చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఎలక్ట్రిక్ కారును వోల్వో కంపెనీ ఆవిష్కరించింది. వోల్వో కొత్త మిడ్ రేంజ్ ఎలక్ట్రిక్ SUV EX60ని గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దాంతో ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇదో భారీ సంచలనం అని చెప్పవచ్చు. గూగుల్ జెమిని ఏఐ ఆధారంగా తయారైన ఈ ఎస్‌యూవీ కారు జనవరి 21, 2026న ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
ఈ కారు కేవలం ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే కాదు. రోడ్లపై నడిచే సూపర్-స్మార్ట్ కంప్యూటర్ అనమాట.. ఆకట్టుకునే అడ్వాన్స్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ కారు చేయలేని అన్ని టాస్కులను ఇది చేయగలదు. ఏఐ కారు ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
ఏఐ కారు మీతో మాట్లాడగలదు :
ఈ కారులో అతిపెద్ద ఫీచర్ జెమిని ఏఐ. సాంప్రదాయ వాయిస్ అసిస్టెంట్ కన్నా చాలా అడ్వాన్స్ ఫీచర్. ఇప్పటివరకు, కార్లలో బటన్లను ట్యాప్ చేయడం ద్వారా లేదా కొన్ని ఆర్డర్స్ ద్వారా టాస్కులు జరిగేవి. కానీ, వోల్వో EX60 కారులో గూగుల్ జెమిని ఏఐ అంతా కంట్రోల్ చేస్తుంది. అచ్చం మనిషి మాదిరిగానే మాట్లాడుతుంది.
Volvo EX60 EV (Image Credit To Original Source)
మీరు కారుకు కమాండ్స్ అందిస్తుంది. ఏసీ ఆన్ చేయాలన్నా లేదా ఆఫ్ చేయాలన్నా అదే చూసుకుంటుంది. మీరు కూడా ఏఐతో మాట్లాడవచ్చు. మనం మాట్లాడే ప్రతి పదాన్ని అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలదు.
ఇమెయిల్ క్యాలెండర్ ఇంటిగ్రేషన్ :
మీ జీమెయిల్ క్యాలెండర్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ మీటింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఇమెయిల్ నుంచి అడ్రస్ ట్రాక్ చేసి నావిగేషన్‌లో నేరుగా ఎంటర్ చేయవచ్చు. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ షెడ్యూల్ మెసేజ్ కూడా ఏఐ చదివి పెడుతుంది.
మన కళ్లు చేసే పని ఏఐ చేస్తుంది :
ఇకపై అంతా ఏఐదే ఫ్యూచర్.. 360-డిగ్రీ కెమెరాలు బయట వైపు చూడగలవు. బయట ఏ భవనం ఉందో మీరు కారును అడగవచ్చు. ఏఐ వెంటనే ఆన్సర్ చేస్తుంది. కంటి రెప్పలో డేటాను ప్రాసెస్ చేసే టెక్నాలజీతో NVIDIA క్వాల్ కామ్ నుంచి సూపర్-ఫాస్ట్ చిప్‌లతో కూడా అమర్చి ఉంటుంది.
బ్యాటరీ, రేంజ్, పర్ఫార్ఫ్మెన్స్ :
ఈ కారు వోల్వో కొత్త SPA3 800-వోల్ట్ ప్లాట్‌ఫామ్‌పై గతంలో కన్నా వేగంగా పవర్ అందిస్తుంది. ఈ కారు 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
1-P6 (RWD) : ఈ ఎంట్రీ-లెవల్ మోడల్ 374 హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తుంది. 80kWh బ్యాటరీతో 620 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
2 : P10 (AWD) – ఈ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ 503 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 91kWh బ్యాటరీతో వస్తుంది. పూర్తి ఛార్జ్‌లో 720 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
3 : P12 (AWD) : ఈ కారు ఫ్లాగ్‌షిప్ మోడల్. 670 హార్స్‌పవర్ అద్భుతమైన పవర్ ఇస్తుంది. కేవలం 3.5 సెకన్లలో 100 స్పీడ్ అందుకుంటుంది. రేంజ్ 810 కి.మీ వరకు ఉంటుంది.
సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ :
10 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. 400kW ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 10 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. 400 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. వెహికల్-టు-హోమ్ (V2H) ఫీచర్ కూడా ఉంది. మీ ఇంటి లైట్ల కోసం ఈ కారు బ్యాటరీని కూడా వాడుకోవచ్చు.
Volvo EX60 EV (Image Credit To Original Source)
ఇంటీరియర్, ఫీచర్లు :
ఈ కారులో 15-అంగుళాల పెద్ద OLED స్క్రీన్, పవర్‌ఫుల్ బోవర్స్, విల్కిన్స్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. టెస్లా సూపర్‌చార్జర్ (NACS పోర్ట్) కూడా ఉంది. ఈ కారు మెగా-కాస్టింగ్ టెక్నాలజీతో తయారైంది. అందుకే స్ట్రాంగ్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది.
బుకింగ్స్ ఎప్పడంటే? :
యూరప్‌లో వోల్వో ఈ కారు కోసం ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. 2026 సమ్మర్ నాటికి అమెరికాలో బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. లగ్జరీ కార్ల కోసం చూసేవారికి ఏఐ ఫీచర్లు కోరుకునేవారికి ఈ కారు అద్భుతమైన ఆప్షన్.