Jio Airtel Plans : జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లకు పండగే.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో 150GB డేటా, OTT బెనిఫిట్స్ ఫ్రీ.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..

Jio Airtel Plans : జియో, ఎయిర్‌టెల్ యూజర్ల కోసం అందించే ఈ ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి.. 150GB డేటాతో పాటు ఓటీటీ యాప్స్ కూడా ఫ్రీగా యాక్సస్ చేయొచ్చు.

Jio Airtel Plans : జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లకు పండగే.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో 150GB డేటా, OTT బెనిఫిట్స్ ఫ్రీ.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..

Jio Airtel Plans

Updated On : January 23, 2026 / 2:35 PM IST
  • జియో, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్లు
  • ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్, జియో రూ. 449 ప్లాన్, ఫ్యామిలీ యాడ్ ఆన్ సిమ్ 
  • ఫ్రీ కాలింగ్ ఓటీటీ బెనిఫిట్స్, జెమిని ఏఐ ప్రో ప్లాన్ కూడా

Jio Airtel Plans : రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. జియో, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పాటు బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను సరసమైన ధరకే అందిస్తున్నాయి. అంతేకాదు.. ఫ్యామిలీ పోస్టుపెయిడ్ ప్లాన్లు కూడా ఉన్నాయి.

ప్రత్యేకించి ఫ్యామిలీ మెంబర్లకు సాధారణ సిమ్ కార్డ్, అదనపు సిమ్ కార్డులను అందిస్తాయి. 150GB వరకు డేటాతో పాటు అనేక OTT యాప్‌లకు ఫ్రీ యాక్సెస్‌ అందిస్తాయి. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ కూడా ఉన్నాయి. ఈ ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జియో రూ. 449 ప్లాన్ :
ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక జనరల్ సిమ్‌తో పాటు 3 యాడ్-ఆన్ సిమ్‌ల ఆప్షన్ అందిస్తుంది. ప్రతి సిమ్‌కు రూ. 150 చెల్లించాలి. ఈ ప్లాన్ మొత్తం 75GB డేటాను అందిస్తుంది. ప్రతి అదనపు సిమ్‌కు 5GB అదనపు డేటా లభిస్తుంది.

ఫ్రీ కాలింగ్, OTT బెనిఫిట్స్ :
ఈ జియో ప్లాన్ అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌తో వస్తుంది. కంపెనీ రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ జియో హాట్‌స్టార్, జియో టీవీలకు ఫ్రీ యాక్సెస్‌తో కూడా వస్తుంది.

Read Also : Apple iPhone 18 : ఆపిల్ ఐఫోన్ 18 వచ్చేది ఎప్పుడో తెలిసిందోచ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్

గూగుల్ జెమిని ప్రో ప్లాన్ ఫ్రీ :
ఈ రిలయన్స్ జియో ప్లాన్ రూ. 35,100 ధరతో గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌కు సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది. ఈ ప్లాన్ 18 నెలల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్ :
ఈ ప్లాన్ రెగ్యులర్ సిమ్, రెండు ఫ్రీ యాడ్-ఆన్ సిమ్‌లను అందిస్తుంది. ప్రైమరీ యూజర్ 150GB డేటాను పొందవచ్చు. యాడ్-ఆన్ మెంబర్లకు కంపెనీ ఒక్కొక్కరికి 30GB డేటాను అందిస్తోంది.

ఫ్రీ SMS, ఫోన్ కాలింగ్ :
ఈ రీఛార్జ్ ప్లాన్ 100 ఫ్రీ SMS బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ వస్తుంది. మీరు 100GB గూగుల్ వన్ స్టోరేజీని కూడా పొందవచ్చు.

OTT యాప్స్ ఫ్రీ :
ఈ ప్లాన్ 6 నెలలు అమెజాన్ ప్రైమ్, ఒక ఏడాదికి జియో హాట్‌స్టార్ మొబైల్, ఆపిల్ టీవీని యాక్సస్ చేయొచ్చు. మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంకు కూడా యాక్సెస్ పొందవచ్చు.