Apple iPhone 18 : ఆపిల్ ఐఫోన్ 18 వచ్చేది ఎప్పుడో తెలిసిందోచ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్
Apple iPhone 18 : కొత్త ఆపిల్ ఐఫోన్ 18 వచ్చేస్తోంది.. 2027లో రాబోయే ఐఫోన్ 18కు సంబంధించి కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.. ఇందులో A20 చిప్‌సెట్, 24MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది.
Apple iPhone 18
- సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్, ఫోల్డ్ లాంచ్
- 2027 ప్రారంభంలో ఐఫోన్ స్టాండర్డ్ ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్స్
- బేస్ మోడల్ ఆపిల్ ఐఫోన్ 18eతో కూడా అప్పుడే
Apple iPhone 18 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఐఫోన్ 18 వచ్చేస్తోంది. రాబోయే ఐఫోన్ 18 మోడల్ గురించి ఇప్పటినుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. బేస్ ఐఫోన్ లైనప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి అనేది ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఐఫోన్ 18 లాంచ్ టైమ్ ఇప్పట్లో కాదు.. కానీ, లీక్‌లు, ముందస్తు రిపోర్టులలో ఐఫోన్ తయారీదారు ఏం ప్లాన్ చేస్తుందో ముందుగానే రివీల్ చేసేశాయి.
అంతేకాదు.. ఐఫోన్ 18 లాంచ్‌కు ముందే ఐఫోన్ పర్ఫార్మెన్స్, కెమెరాలు, బ్యాటరీ ఆప్టిమైజేషన్, సాఫ్ట్‌వేర్ పర్ఫార్మెన్స్‌పైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. ఐఫోన్ 18 ఫీచర్లకు విషయంలో కూడా 5 కీలక మార్పులు ఉండనున్నాయి. ఇంతకీ అవేంటో ఓసారి చూద్దాం..
1) ఐఫోన్ 18 లాంచ్ ఆలస్యం :
ఆపిల్ చాలా ఏళ్లుగా సెప్టెంబర్ నెలలోనే కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి అలా ఉండకపోవచ్చు. నివేదికల ప్రకారం.. ఆపిల్ సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ ఫోల్డ్‌లను మాత్రమే లాంచ్ చేసే అవకాశం ఉంది. స్టాండర్డ్ ఐఫోన్ 18ని మాత్రం 2027 ప్రారంభంలో లాంచ్ చేయొచ్చు. బేస్ మోడల్ ఐఫోన్ 18eతో పాటు రావచ్చని అంచనా.
2) A20 చిప్ :
ఐఫోన్ 18 మోడల్ ఈసారి లేటుగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మెయిన్ చిప్‌సెట్ అప్‌గ్రేడ్‌తో రావొచ్చు. లీక్‌ల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18లో A20 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. 2nm ప్రాసెస్ పవర్ కెపాసిటీ, పర్ఫార్మెన్స్ రెండింటినీ అందిస్తుందని అంచనా.
3) కెమెరా అప్‌గ్రేడ్‌లు :
ఐఫోన్ 17లో కెమెరా ఫీచర్లు, అత్యంత ఆకర్షణీయంగా నిలిచాయి. ఐఫోన్ 18 మోడల్ కోసం పూర్తిగా హార్డ్‌వేర్ మార్చాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయినప్పటికీ, ఆపిల్ ప్రో లైనప్‌కు సరిపోయేలా బేస్ ఐఫోన్ 18కి కొత్త 24MP ఫ్రంట్ కెమెరాను తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్, కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ వంటి అట్రాక్టివ్ ఫీచర్లను అందించవచ్చు.
4) బ్యాటరీ లైఫ్ :
ఆపిల్ బ్యాటరీ విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. రాబోయే ఐఫోన్ 18 కూడా పవర్ ఫుల్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి కొత్త చిప్ పవర్-ఫ్రెండ్లీగా అందించనుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఎక్కువ సమయం వచ్చేలా బ్యాటరీ ఉండొచ్చు. వాస్తవానికి ఏ బ్యాటరీ అయినా వాడకం బట్టి ఛార్జింగ్ అనేది మారవచ్చు. ఏదిఏమైనా గత ఐఫోన్లతో పోలిస్తే ఈసారి బ్యాటరీ పరంగా మెరుగైన సామర్థ్యాన్ని అందించనుంది.
5) iOS27 :
ఐఓఎస్ 27 అనేది మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ డివైజ్‌ల కోసం ఆపిల్ తీసుకొస్తోంది. ఆప్టిమైజేషన్ బగ్ ఫిక్సింగ్ పైనే కంపనీ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఐఫోన్ 18 లాంచ్ సమయానికి సిరి కూడా మరింత అప్ గ్రేడ్ కానుంది. ఆపిల్ జెమిని-ఆధారిత ఏఐ అప్ గ్రేడ్ ఫీచర్లను కూడా అందించనుంది.
