మీకు ఏ కార్ లోన్ సెట్ అవుతుందో తెలుసా..

కొత్త కారు కొనాలంటే టెంప్టేషన్ మామూలే. లైఫ్ లో ఫస్ట్ కార్ అయినా లేదా అప్ గ్రేడ్ కార్ అయినా తీసుకుని కుటుంబంలోకి తీసుకురావాలని ఎవరికి ఉండదు. మరి కారు కొనాలి అనుకుంటే మీకు ఏది సూట్ అవుతుందో.. మీ కొనుగోలును ఏది ఈజీ చేస్తుందో.. తెలుసుకున్నారా..

కార్ లోన్స్ సాధారణంగా మూడు నుంచి ఐదేళ్ల వరకూ ఉంటాయి. కొందరు ఏడేళ్ల వరకూ ఈఎమ్ఐలు కూడా ఇస్తున్నారు. లోన్ తీర్చడానికి ఎక్కువకాలం తీసుకున్నారంటే తక్కువ మొత్తంలో ఈఎమ్ఐ(వాయిదా)లు కట్టుకోవచ్చు. ఇది కార్ ఖరీదును బట్టి ఉంటుంది. ఎక్కువ కాలం అయినా పర్లేదు అనుకుంటే వడ్డీ మాత్రం భారీగా పడుతుందన్న మాట.

కార్ అనేది తరిగిపోయే ఆస్తే కానీ, దాని వల్ల భవిష్యత్ లాభాలు ఏమీ రావనేది గుర్తుంచుకోవాలి. అందుకే పెద్ద లోన్ అనేది సరైన పని కాదు. కారు లోన్ తీరడానికి షార్ట్ గ్యాప్ తీసుకుంటే భారీ ఈఎమ్ఐ పడొచ్చు. అవి ఎక్కువ మొత్తంలో ఉండి చెల్లించడానికి వీలు కాకపోతే మీ క్రెడిట్ స్కోర్ పైనా భారంపడొచ్చు. అవన్నీ ముందుగానే కండిషన్స్ అప్లైలో రాసి ఉంచుతారనేది మర్చిపోవద్దు.

కొందరేమో ఎక్స్ షో రూమ్ వరకూ లోన్ ఇస్తామంటే మరికొందరు 80శాతం లోన్ మాత్రమే ఇస్తామని చెబుతుంటారు. లోన్ అమౌంట్ మాత్రమే చూసి టెంప్ట్ అయిపోకుండా ప్రోసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీల గురించి కూడా ఆరా తీయడం మర్చిపోకండి.