Hallmark Gold
Hallmark Gold : బంగారం కొంటున్నారా? గోల్డ్ కొనుగోలు చేసే సమయంలో అది స్వచ్ఛమైనదా కాదా? అని చెక్ చేయడం చాలా ముఖ్యం. కల్తీ బంగారం (Hallmark Gold) మార్కెట్‌లో ఎక్కువగా చలామణి అవుతోంది.
కొనుగోలుదారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛతను తెలుసుకునేందుకు 5 ముఖ్యమైన విషయాలను తప్పకు గుర్తించుకోవాలి.
హాల్మార్క్ గుర్తును చెక్ చేయండి :
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్ మార్క్ సింబల్ బంగారం స్వచ్ఛతను తెలియజేస్తుంది. హాల్ మార్క్ బీఐఎస్ లోగో, స్వచ్ఛత (22K916), అసెసింగ్ హాల్ మార్కింగ్ కేంద్రం వంటి వివరాలు ఉంటాయి. కొనుగోలు చేసేటప్పుడు ఈ గుర్తులను జాగ్రత్తగా పరిశీలించండి.
హాల్‌మార్క్ వెరిఫికేషన్ :
మీరు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు లేదా బంగారు నాణేలు/బిస్కెట్లకు హాల్మార్క్ గుర్తు ఉన్నప్పటికీ.. మీరు బీఐఎస్ వెబ్‌సైట్లో లేదా బీఐఎస్ కేర్ మొబైల్ యాప్‌లో హాల్‌మార్క్ గుర్తింపు సంఖ్యను ధ్రువీకరించుకోవడం మంచిది. మీరు కొనుగోలు చేస్తున్న బంగారం నిజమైనదని, సరైన స్వచ్ఛతను కలిగి ఉందని నిర్ధారించుకోవాలి.
నమ్మకమైన విక్రయదారుల నుంచి కొనండి :
మీ బంగారం కొనుగోలు కోసం లైసెన్స్ పొందిన నమ్మకమైన జ్యువెలర్స్ లేదా బ్యాంకుల వంటి గుర్తింపు పొందిన విక్రయదారులను ఎంచుకోండి. నమ్మకమైన పేరు, పారదర్శక ధర ఉండాలి.
అనుమానాస్పదమైన లేదా తెలియని వ్యక్తుల నుంచి కొనడం మానుకోండి. ప్రతి విక్రయదారుడికి లూమ్ నంబర్ ఉంటుంది. హాల్‌మార్క్ నగలపై ముద్రించి ఉంటుంది. ఆ నంబరు ఉంటే.. సెల్లర్‌కు బీఐఎస్ రిజిస్ట్రేషన్ ఉన్నట్టే గుర్తించాలి.
అన్ని వివరాలతో రసీదు :
మీరు గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు విక్రయదారుడి నుంచి తప్పనిసరిగా రసీదును తీసుకోండి. కొనుగోలు చేసిన బంగారం స్వచ్ఛతను పేర్కొంటూ ధృవీకరణ పత్రాన్ని అడగండి.
Read Also : Home Loan : గుడ్ న్యూస్.. 8 శాతం వడ్డీకే హోమ్ లోన్లు ఇస్తున్న బ్యాంకులు.. ఫుల్ డిటెయిల్స్..!
భవిష్యత్తులో ఏదైనా సమస్యలు తలెత్తితే.. ఈ పత్రాలు మీకు సాయపడతాయి. చాలా షాపుల్లో ఇప్పుడు గోల్డెస్టింగ్ మెషీన్లు ఉంటున్నాయి. తద్వారా నగల స్వచ్ఛతను సులువుగా తెలుసుకోవచ్చు.