Mahindra Scorpio N
Mahindra Scorpio N : కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? మీరు మహింద్రా స్కార్పియో కారు కొనాలని అనుకుంటే ఇది మీకోసమే. చాలామంది SUV కార్లు కొనాలని ఉంటుంది. ఈ కార్లనే ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతుంటారు.
మీరు కూడా SUV కారు కొనాలని అనుకుంటే మహీంద్రా స్కార్పియో ఎన్ కొనేసుకోవచ్చు. ఇది SUVలకు రారాజు. భారతీయ రోడ్లను శాసించే ఈ మహీంద్రా స్కార్పియో-ఎన్ యువత, ఫ్యామిలీ కస్టమర్లకు డ్రీమ్ కారు కూడా.
పవర్‌ఫుల్ లుక్స్, మరెన్నో ఫీచర్లు ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే, ఈ కారును కొనాలంటే ఇష్టం ఒక్కటే ఉంటే సరిపోదు కదా.. అంత బడ్జెట్ కూడా చేతిలో ఉండాలి. ఈ పెద్ద కారు మీ ఇంటికి రావాలంటే బ్యాంకు బ్యాలెన్స్ కూడా గట్టిగానే ఉండాలి. మీరు ఈ స్కార్పియోను కొనాలంటే ఎన్ని లక్షలు కావాలి? మీ నెలవారీ ఆదాయం ఎంత ఉంటే సాధ్యమో అనేది పూర్తి లెక్కలను ఇప్పుడు వివరంగా చూద్దాం..
కారు ధర ఎంత? మీ బడ్జెట్ ఎంత? :
స్కార్పియో-ఎన్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 14 లక్షల నుంచి ప్రారంభమై రూ. 25 లక్షల వరకు ఉంటుంది. అది కూడా టాప్ మోడల్స్. అత్యంత పాపులర్ పొందిన Z4 లేదా Z6 డీజిల్ వేరియంట్లకు ఆన్-రోడ్ ధర (ఇన్సూరెన్స్, ఆర్టీఓ, ఇతర పన్నులతో సహా) దాదాపు రూ. 18 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది.
ఈఎంఐ ఎలా లెక్కించాలి? :
మీరు మిడ్-స్పెక్ స్కార్పియో-ఎన్ వేరియంట్‌ను ఎంచుకున్నారని అనుకుందాం. ఈ కారు ధర ఆన్-రోడ్ ధర రూ. 19 లక్షలు ఉంటుంది.
డౌన్ పేమెంట్ : మీరు కనీసం 20శాతం అంటే రూ. 3.80 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి.
లోన్ మొత్తం : ఇప్పుడు మీ మొత్తం బ్యాంక్ లోన్ రూ. 15.20 లక్షలు అవుతుంది.
వడ్డీ రేటు, కాలపరిమితి : మీరు సగటున 9.5శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్లు (60 నెలలు) లోన్ తీసుకుంటే మీ నెలవారీ ఈఎంఐ దాదాపు రూ. 31,900 ఉంటుంది.
మీ జీతం ఎంత ఉండాలి? :
దీనికి ఒక రూల్ ఉంది. అదే 20/4/10 రూల్.. అంటే మీ కారు ఈఎంఐ మీ చేతికి వచ్చే జీతంలో 25 శాతం నుంచి 30 శాతం మించకూడదు. మీ ఈఎంఐ నెలకు రూ.32వేలు అయితే, మీ నెలవారీ చేతికి అందే జీతం కనీసం రూ. లక్ష నుంచి రూ. 1.20 లక్షలు ఉండాలి.
అప్పుడే కారు ఈఎంఐ చెల్లించిన తర్వాత కూడా ఇంటి ఖర్చులు, పెట్టుబడులు, ఎమర్జెన్సీ ఫండ్ కోసం తగినంత డబ్బు అందుబాటులో ఉంటుంది. మీకు ఇతర లోన్లు (గృహ రుణం లేదా వ్యక్తిగత రుణం) లేకపోతే రూ. 80వేలు జీతం ఉన్నప్పటికీ మీరు రిస్క్ తీసుకోవచ్చు. కానీ, కొద్దిగా ఆర్థిక ఒత్తిడితో కూడుకున్న పని అవుతుంది.
ఈ ఖర్చులను మర్చిపోవద్దు :
కేవలం ఈఎంఐ చెల్లిస్తే సరిపోదు. స్కార్పియో-ఎన్ లాంటి పెద్ద SUV కారును సొంతం చేసుకోవాలంటే ఇతర ఖర్చులు కూడా భారీగా ఉంటాయి.
ఫ్యూయిల్ : నెలకు 1000 కి.మీ డ్రైవింగ్‌కు దాదాపు రూ. 8వేలు నుంచి రూ. 10వేలు
మెయింట్‌నెన్స్ : వార్షిక సర్వీసింగ్, ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం ప్రతి నెలా రూ. 2వేల నుంచి రూ. 3వేలు పక్కన పెట్టండి.