Gold: ట్రంప్, ఎలాన్ మస్క్‌ను కదిలించిన ఫోర్ట్ నాక్స్‌ బంగారం మాయం రూమర్లు.. ఇప్పుడేం జరుగుతోంది?

అప్పట్లో అమెరికా ప్రభుత్వం కొంతమంది జర్నలిస్ట్ ప్రతినిధులకు, కాంగ్రెస్ సభ్యులకు ఫోర్ట్ నాక్స్‌ను సందర్శించేందుకు అనుమతి ఇచ్చింది.

Gold: ట్రంప్, ఎలాన్ మస్క్‌ను కదిలించిన ఫోర్ట్ నాక్స్‌ బంగారం మాయం రూమర్లు.. ఇప్పుడేం జరుగుతోంది?

Updated On : February 24, 2025 / 4:49 PM IST

అమెరికా ప్రభుత్వ బంగారు నిల్వలు ఉండే స్థలం ‘ఫోర్ట్ నాక్స్‌’ను తనిఖీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. అధికారులు చెబుతున్న లెక్కల పరంగా అంత బంగారం ఉందా? అలాగే బంగారు నిల్వలు సురక్షితంగా ఉన్నాయా? అని నిర్ధారించుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది.

ఈ తనిఖీల్లో డోజ్ చీఫ్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొంటారని ట్రంపే స్వయంగా రిపబ్లికన్ గవర్నర్ల సమావేశంలో వెల్లడించారు. అలాగే ఫోర్ట్ నాక్స్ గదులను తెరవబోతున్నామని, బంగారం అక్కడే ఉందో లేదో చూస్తామని ట్రంప్ తెలిపారు. అలాగే డోర్ ఓపెన్ చేసినపుడు బంగారం నిల్వ ఉన్న గదులు ఖాళీగా ఉండకూడదని వ్యంగ్యంగా కూడా అన్నారు.

అమెరికా బంగారాన్ని ఫోర్ట్ నాక్స్ లో 1937 నుంచి నిల్వచేస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భద్రతతో కూడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం వేసవిలో యూఎస్ ఆర్మీ అధికారులు ట్రైనింగ్ సెషన్స్ కూడా నిర్వహిస్తారు.

Also Read: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి.. ఇలా చెక్‌ చేసుకోండి..

కెంటకీ రాష్ట్రంలో 1,09,000 ఎకరాల విస్తీర్ణంలో ‘ఫోర్ట్ నాక్స్’ ఉంది. ఇక్కడ ఫోర్ట్ నాక్స్‌లో 147.3 మిలియన్ ఔన్సుల బంగారం ఉంది. అలాగే ఫోర్ట్ నాక్స్ అత్యంత భద్రతతో కూడిన ప్రదేశం. ఈ భద్రతా విధానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి.  ఒకే వ్యక్తి వెళ్లి మొత్తం భద్రతా ప్రక్రియను పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం.

అప్పట్లో.. మళ్లీ ఇప్పుడు..
ఇక్కడ ఇతరులకు సందర్శన నిషేధం. 1974 లో ‘ఫోర్ట్ నాక్స్’ లో బంగారం లేదని, చాలా బంగారాన్ని చోరీ చేశారని అనే వదంతులు రావడంతో వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు అప్పటి అమెరికా ప్రభుత్వం కొంతమంది జర్నలిస్ట్ ప్రతినిధులకు, అలాగే కాంగ్రెస్ సభ్యులకు ఫోర్ట్ నాక్స్‌ను సందర్శించేందుకు అనుమతి ఇచ్చింది.

దాని తర్వాత 2017లో అప్పటి ఖజానా కార్యదర్శి ‘స్టీవ్ మ్నుచిన్’, కెంటకీ గవర్నర్ మ్యాట్ బెవిన్ కలిసి ఫోర్ట్ నాక్స్‌ను సందర్శించారు. ఇప్పుడు ట్రంప్ తాజా నిర్ణయంతో ‘ఫోర్ట్ నాక్స్’ లో బంగారం ఉందో, లేదో తెలుసుకోవడానికి ‘ఫోర్ట్ నాక్స్’ తలుపులు తీయడానికి సిద్ధంగా ఉంది.