WhatsApp Passkey : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ పాస్‌కీ వచ్చేసింది.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Passkey : వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఐఫోన్లలో పాస్‌కీ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల భద్రత కోసం సాంప్రదాయ 6-అంకెల కోడ్‌ని బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ పద్ధతులతో లాగిన్ ప్రక్రియను సులభతరం చేస్తుంది.

WhatsApp Passkey is now available on iPhone, here is how it works

WhatsApp Passkey : మీరు పాస్ కీ సెట్ చేసుకున్నారా? ఐఫోన్ యూజర్ల కోసం సరికొత్తగా సెక్యూరిటీ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత రోజుల్లో అనేక వెబ్‌సైట్‌లు, యాప్‌లలో పాస్‌కీలు ప్రముఖ సెక్యూరిటీ ఆప్షన్లలో ఒకటిగా మారుతున్నాయి.

గూగుల్, మెటా వంటి అనేక టెక్ దిగ్గజాలు తమ ఆన్‌లైన్ అకౌంట్లను ప్రొటెక్ట్ చేసుకునేందుకు పాస్‌కీలను ఎనేబుల్ చేయాలని తమ యూజర్లను ప్రోత్సహిస్తున్నాయి. మెటా గత ఏడాది ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్ల కోసం పాస్‌కీలను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు, వాట్సాప్ ఈ ఫీచర్ లభ్యతను విస్తరిస్తోంది. అతి త్వరలో ఐఫోన్ యూజర్లకు పాస్‌కీ సెటప్ చేసుకునేందుకు అనుమతిస్తుంది.

Read Also : WhatsApp New Updates : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఛానెల్స్, వాయిస్ నోట్స్, పోల్స్ కోసం సరికొత్త ఫీచర్లు..!

వాట్సాప్ (WABetaInfo)ప్రకారం.. వాట్సాప్ అకౌంట్ ధృవీకరణ కోసం iOS యాప్ పాస్‌కీ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఫ్యూచర్ అప్‌డేట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ రిపోర్టు ప్రకారం. ఐఓఎస్ 24.2.10.73 వెర్షన్ వాట్సాప్ బీటా నుంచి స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఫీచర్‌లను టెస్టింగ్ చేయడం కోసం (TestFlight) యాప్‌లో అందుబాటులో ఉంది.

భవిష్యత్తులో వినియోగదారులు తమ సొంత పాస్‌కీని కాన్ఫిగర్ చేసుకోగలిగే కొత్త సెక్షన్ అభివృద్ధి చేసే ప్రక్రియలో వాట్సాప్ ఉందని నివేదిక సూచిస్తోంది. ఈ పాస్‌కీ కాన్ఫిగరేషన్ లాగిన్ ప్రక్రియను మరింత మెరుగుపరుస్తుంది. అకౌంట్ యాక్సెస్ చేయడానికి 6-అంకెల కోడ్ అవసరం ఉండదు. పాస్‌కీని కాన్ఫిగర్ చేసిన తర్వాత వినియోగదారులు ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ లేదా డివైజ్ పాస్‌కోడ్ వంటి ప్రస్తుత అథెంటికేషన్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా వారి అకౌంట్లలో లాగిన్ చేయొచ్చు.

పాస్‌కీలు అంటే ఏంటి? :
పాస్‌కీ అనేది వినియోగదారులు ప్రతిసారీ 6-అంకెల కోడ్‌ను ఎంటర్ చేయకుండా వారి అకౌంట్లను లాగిన్ చేయడానికి అనుమతించే ఫీచర్. ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహకారంతో ఎఫ్‌ఐడీఓ అలయన్స్ అభివృద్ధి చేసిన సేఫ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. పాస్‌వర్డ్‌లకు బదులుగా బయోమెట్రిక్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ పద్ధతులతో అథెంటికేషన్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఇకపై పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదా టైప్ చేయనవసరం ఉండదు. ఈ లాగిన్ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకొస్తోంది.

WhatsApp Passkey is now available on iPhone, here is how it works

వాట్సాప్‌లో పాస్‌కీ ఫీచర్‌ను ఉపయోగించాలా వద్దా అని యూజర్లు నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే ఆప్షనల్ మాత్రమే. యాప్ సెట్టింగ్‌ల నుంచి ఎప్పుడైనా ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిసేబుల్ చేయొచ్చు. పాస్‌కీని సెటప్ చేయని మరో డివైజ్‌లో వాట్సాప్‌కు లాగిన్ చేయాలనుకుంటే వినియోగదారులు సాంప్రదాయ 6-అంకెల కోడ్‌ను కూడా ఉపయోగించవచ్చు.

వాట్సాప్ యూజర్లు ప్రైమరీ సెక్యూరిటీ ఆప్షన్ ఎంచుకోవడానికి వారి స్టేటస్ అనుగుణంగా ఎడ్జెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఐఓఎస్ iOS ఫీచర్ ఇప్పటికీ బీటాలో ఉన్నప్పటికీ.. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ దశలను అనుసరించడం ద్వారా వాట్సాప్‌లో పాస్‌కీలను సెట్ చేయవచ్చు.

  •  వాట్సాప్‌ను లేటెస్ట్ బిల్డ్‌కి అప్‌డేట్ చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • టాప్ రైట్ కార్నర్‌లో మీ ప్రొఫైల్ ఫొటోను నొక్కండి.
  • Settings > Go to Passkey ఆప్షన్‌కు వెళ్లండి.
  • క్రియేట్ పాస్‌కీలను ట్యాప్ చేయండి.
  • ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించండి.

అదనంగా, వాట్సాప్ నవంబర్ 2023 నుంచి ఎస్ఎంఎస్ ధృవీకరణతో పాటు లాగిన్ చేసేందుకు ఇమెయిల్ వెరిఫికేషన్ కూడా అందిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. వినియోగదారులు ఫోన్ నంబర్‌లకు బదులుగా యూజర్ నేమ్ ఉపయోగించడానికి, ఇతరులతో షేర్ చేయడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా, వాట్సాప్ ఐప్యాడ్ వెర్షన్‌పై వర్క్ చేస్తోంది.

ఇంతలో, పాస్‌కీల విషయానికొస్తే.. ఐఓఎస్ 16 నుంచి ఆపిల్ డివైజ్‌లు సఫారీ, ఐక్లౌడ్ కీచైన్ కోసం పాస్‌కీలను సపోర్ట్ చేస్తున్నాయి. ఈ యాక్టివిటీతో ఇప్పుడు iOS 17లోని ఇతర యాప్‌లకు విస్తరిస్తుంది. వినియోగదారులు ఆపిల్ డివైజ్‌లలో ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ ఉపయోగించి వారి పాస్‌కీలను ధృవీకరించవచ్చు.

Read Also : WhatsApp Chat Backup : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో చాట్ బ్యాకప్‌ను గూగుల్ డ్రైవ్‌లోనూ సేవ్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు