WhatsApp Passkeys : వాట్సాప్‌లో ప్రైవసీ ఫీచర్.. పాస్‌కీలతో త్వరలో చాట్ బ్యాకప్‌లను ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు..!
WhatsApp Passkeys : వాట్సాప్ బీటాలో ఈ కొత్త పాస్‌కీల ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్ డేటా భద్రత కోసం ఈ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం, వాట్సాప్ బ్యాకప్‌ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది.

WhatsApp will soon allow users to encrypt their chat backups using passkeys
WhatsApp Passkeys : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వాట్సాప్ సరికొత్త ప్రొటెక్షన్ ఫీచర్ తీసుకొస్తోంది. చాట్ బ్యాకప్ విషయంలో మరింత సెక్యూరిటీ అందిస్తోంది. పాస్‌కీలను ఉపయోగించి యూజర్లు తమ చాట్ బ్యాకప్‌లను ఎన్‌క్రిప్షన్ అనుమతించే కొత్త ప్రైవసీ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. పాస్‌కీలు అనేది సాంప్రదాయ పాస్‌వర్డ్‌లకు బదులుగా ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ వంటి బయోమెట్రిక్ డేటాను ఉపయోగించే డిజిటల్ కీలను అందించనుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.18.13 లేటెస్ట్ వాట్సాప్ బీటాలో టెస్టింగ్ చేస్తోంది.
వాట్సాప్ బీటాలో ఈ కొత్త పాస్‌కీల ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్ డేటా భద్రత కోసం ఈ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం, వాట్సాప్ బ్యాకప్‌ల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. వినియోగదారులు తమ బ్యాకప్ డేటాను కస్టమ్ పాస్‌వర్డ్ లేదా 64-అంకెల ఎన్‌క్రిప్షన్ కీతో ప్రొటెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ మెథడ్స్ హై లెవల్ సెక్యూరిటీ అందిస్తున్నప్పటికీ, క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాలని లేదా సుదీర్ఘమైన ఎన్‌క్రిప్షన్ కీలను వినియోగించాల్సి ఉంటుంది. తద్వారా సొంత డేటా లాక్ అయ్యే రిస్క్ కూడా పెంచుతుంది.
అయితే, ఇప్పుడు ఈ కొత్త పాస్‌కీ ఫీచర్‌తో వాట్సాప్ ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది. వినియోగదారులు వారి బ్యాకప్‌లను సురక్షితంగా ఉంచడానికి ఫింగర్ ఫ్రింట్, ఫేస్ స్కాన్ లేదా స్క్రీన్ లాక్‌తో సహా వారి డివైజ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు తమ ఫోన్‌లను అన్‌లాక్ చేసేందుకు ఉపయోగించే అదే బయోమెట్రిక్ మెథడ్ ఉపయోగించడం ద్వారా వారి ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌లను యాక్సెస్ చేయగలరు. రీస్టోర్ చేయొచ్చు. పాస్‌వర్డ్‌లు, ఎన్‌క్రిప్షన్ కీలను పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు.
మల్టీ డివైజ్‌ల్లో కాంటాక్టు సింకరైజ్ :
అయితే, ఈ ఫీచర్ ఇప్పటికీ బీటాలో ఉంది. చివరకు వాట్సాప్ యూజర్లకు చేరుకోవడానికి మరికొన్ని వారాలు పట్టవచ్చు. అయితే, ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ల కోసం అదనపు భద్రతను అందిస్తుంది. వాట్సాప్ మరో ప్రైవసీ ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. వినియోగదారులు తమ కాంటాక్టులను మల్టీ డివైజ్‌ల్లో సింకరైజ్ చేసుకునేలా అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటా (వెర్షన్ 2.24.18.14)లో తీసుకొస్తుంది. నివేదిక ప్రకారం.. వినియోగదారులు వారి కాంటాక్టు డేటాపై మరింత కంట్రోల్ అందించడానికి ప్రైవసీ, సౌలభ్యం రెండింటినీ అప్‌గ్రేడ్ చేసేందుకు వాట్సాప్ ఈ ఫీచర్‌ను రూపొందించింది.
డెవలప్‌మెంట్ పూర్తయిన తర్వాత వాట్సాప్ ఈ ఫీచర్‌ను వాట్సాప్ సెట్టింగ్‌లలోని కొత్త సెక్షన్‌లో ప్రవేశపెడుతుంది. వినియోగదారులు ప్రతి వాట్సాప్ అకౌంట్ కోసం వారి అడ్రస్ బుక్ సింకరైజ్ స్వతంత్రంగా నిర్వహించవచ్చు. వినియోగదారులు సెకండరీ అకౌంట్ కోసం కాంటాక్టు సింకరైజ్ నిలిపివేసే ఆప్షన్ కూడా పొందవచ్చు. అయితే, ప్రైమరీ అకౌంట్ కోసం ఎనేబుల్ చేయొచ్చు. వివిధ ప్రయోజనాల కోసం ప్రత్యేక కాంటాక్టుల లిస్టులను మేనేజ్ చేసే వారికి ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది.
వినియోగదారులు ఆటోమేటిక్ కాంటాక్ట్ సింక్ స్టాప్ చేసినా వాట్సాప్ వినియోగదారులకు పర్సనల్ కాంటాక్టుల కోసం మాన్యువల్ సింక్ ఆప్షన్ అందిస్తుంది. వినియోగదారులు తమ పూర్తి అడ్రస్ బుక్ డివైజ్‌లో షేర్ చేయకుండా అవసరమైన నిర్దిష్ట కాంటాక్టులను ఎంపిక చేసుకుని సింకరైజ్ చేసేందుకు అనుమతిస్తుందని నివేదిక పేర్కొంది. మాన్యువల్‌గా సింకరైజ్ చేసిన కాంటాక్ట్‌లు వ్యక్తిగత డేటాపై నియంత్రణను కొనసాగిస్తూనే, అన్ని లింక్ చేసిన డివైజ్‌లలో యాక్సెస్ చేయొచ్చు. ముఖ్యంగా కాంటాక్టు సింకరైజ్ చేసేందుకు ఈ ప్రైవసీ ఫీచర్ ఇప్పటికీ టెస్టింగ్ దశలో ఉంది. భవిష్యత్ అప్‌డేట్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read Also : Realme 13 5G Series : రియల్‌మి 13 5జీ సిరీస్ చూశారా? ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..!