WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగా డబుల్ ట్యాప్ చేయెచ్చు..!

WhatsApp New Feature : వాట్సాప్ ప్లాట్‌ఫారంలో నుంచే వేగంగా రియాక్షన్ తెలిపేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఒక రియాక్షన్ మాత్రమే ఎంచుకునేందుకు అవకాశం ఉంది.

WhatsApp double-tap reaction feature ( Image Source : Google )

WhatsApp New Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. అతి త్వరలో రాబోయే కొత్త ఫీచర్‌ మరిన్ని ప్రయోజనాలను అందించనుంది. వాట్సాప్ యూజర్లుఫోటోలు, వీడియోలు, జిఫ్ సహా మల్టీమీడియా కంటెంట్‌కు షేర్ చేయొచ్చు.

Read Also : Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు పండగే.. దిగొచ్చిన ఐఫోన్ల ధరలు.. ప్రో మోడల్స్‌పై ఫస్ట్ టైం తగ్గింపు..!

వాట్సాప్ ప్లాట్‌ఫారంలో నుంచే వేగంగా రియాక్షన్ తెలిపేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఒక రియాక్షన్ మాత్రమే ఎంచుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వాట్సాప్ రాబోయే ఫీచర్‌ ద్వారా వేగంగా రియాక్షన్ తెలిపవచ్చు. టెక్స్ట్ మెసేజ్‌పై డబుల్ క్లిక్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇలాంటి ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇప్పటికే అందుబాటులో ఉంది. డబుల్ ట్యాప్ రియాక్షన్ ద్వారా చాట్‌లకు యాక్సస్ అందిస్తుంది.

వాట్సాప్ డబుల్ ట్యాప్ రియాక్షన్ ఫీచర్ :
నివేదిక ప్రకారం.. ఈ రియాక్షన్ ఫీచర్.. వాట్సాప్ ఇతర యూజర్లతో ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు వీలు ఉంటుంది. ఈ ఫీచర్ యూజర్లు కేవలం మెసేజ్‌పై రెండు సార్లు ట్యాప్ చేసి స్పందించడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ రియాక్షన్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వినియోగదారులు తమ భావాలను త్వరగా వ్యక్తీకరించవచ్చు.

డబుల్-ట్యాప్ రియాక్షన్ ఫీచర్ యూజర్లను డిఫాల్ట్ హార్ట్ ఎమోజీతో త్వరగా కస్టమైజ్ చేసేందుకు అనుమతిస్తుంది. సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ ఫీచర్‌ను రూపొందించిన తర్వాత వినియోగదారులు డిఫాల్ట్ హార్ట్ ఎమోజితో కాకుండా వేరే ఎమోజితో రియాక్షన్ ట్రేని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్‌డేట్ ఆప్షనల్ లేదా డిసేబుల్ ఆప్షన్ కలిగి ఉంటుందా? అనేది క్లారిటీ లేదు. డబుల్-ట్యాప్ రియాక్షన్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ కొనసాగుతోంది. రాబోయే అప్‌డేట్‌లో ఈ ఫీచర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

వాట్సాప్ రీషేర్ స్టేటస్ అప్‌డేట్స్ :
డబుల్ ట్యాప్ రియాక్షన్ ఫీచర్ కాకుండా వాట్సాప్ మరో ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఫీచర్‌పై పనిచేస్తోంది. రీషేర్ స్టేటస్ అప్‌డేట్స్ పేరుతో కొత్త ఫీచర్, యూజర్లు ట్యాగ్ చేసే స్టేటస్ అప్‌డేట్స్ షేర్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది. స్టేటస్ అప్‌డేట్‌లో ఎవరైనా పంపినప్పుడు ఈ కొత్త ఫీచర్ వారిని వారి కాంటాక్టులతో ఆ అప్‌డేట్‌ను రీషేర్ చేసేందుకు అనుమతిస్తుంది.

వాట్సాప్‌లో ఫీచర్ స్టేటస్ అప్‌‌డేట్ ఇంటర్‌ఫేస్‌లో కొత్త బటన్‌ను కలిగి ఉంటుంది. ఈ బటన్ పేర్కొన్న స్టేటస్ అప్‌డేట్స్ సులభంగా రీషేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా స్క్రీన్‌షాట్‌ లేదా మీడియాను ప్రైవేట్‌గా పంపమని షేర్ చేసిన వారికి రిక్వెస్ట్ చేయడం వంటి ఇబ్బందులను నివారిస్తుంది. ప్రస్తుతానికి, బీటా టెస్టర్‌లకు రీషేర్ స్టేటస్ అప్‌డేట్ ఫీచర్ అందుబాటులో లేదు. ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ అధికారిక రిలీజ్ ముందే ఈ యాక్టివిటీని అప్‌గ్రేడ్ చేయనుంది. రాబోయే అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also : WhatsApp Meta AI : వాట్సాప్‌ మెటా ఏఐ మరో 6 కొత్త భాషల్లోకి.. ఇకపై హిందీలోనూ రిప్లయ్ ఇస్తుంది..!

ట్రెండింగ్ వార్తలు