Jatin Dalal: విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ రాజీనామా

జతిన్ దలాల్ స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అపర్ణ అయ్యర్‌ను నియమిస్తున్నట్లు విప్రో సీఈవో థియర్రీ డెలాపోర్టే తెలిపారు.

Jatin Dalal

Jatin Dalal – Wipro: విప్రో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని విప్రో ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. రెండు దశాబ్దాలకుపైగా జతిన్ దలాల్ విప్రోలో సేవలు అందించారు. ఆయనకు ఇతర అవకాశాలు రావడంతో తాజాగా విప్రోకు రాజీనామా చేశారు.

జతిన్ దలాల్ స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అపర్ణ అయ్యర్‌ను నియమిస్తున్నట్లు విప్రో సీఈవో థియర్రీ డెలాపోర్టే (Thierry Delaporte) తెలిపారు. విప్రో ఆర్థిక వ్యూహాలు, ప్రణాళికలో ఇన్నాళ్లు అపర్ణ అయ్యర్‌ కీలక పాత్ర పోషించారని థియర్రీ డెలాపోర్టే చెప్పారు. ఆమెకు కూడా విప్రోలో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది.

ఆమె సెప్టెంబరు 22 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, జతిన్ దలాల్ విప్రోలో 2002లో చేరారు. 2015లో విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. నవంబరు 30న ఆయన విప్రో నుంచి రిలీవ్ కానున్నారు. భారత ఐటీ సేవల ప్రధాన సంస్థల్లో విప్రో ఒకటి.

iPhone iOS 17 Update : ఐఓఎస్ 17 అప్‌డేట్ చేసుకున్నారా? బ్యాటరీ డ్రైన్ సమస్యలు ఎదుర్కొంటున్న ఐఫోన్ యూజర్లు.. కొత్త అప్‌డేట్ రానుందా?