Wrong UPI Payment
Wrong UPI Payment : డిజిటల్ పేమెంట్ల యుగం.. అందరూ ఆన్‌లైన్ యూపీఐ పేమెంట్లు ఎక్కువగా చేస్తుంటారు. ప్రస్తుతం యూపీఐ వాడకం వేగంగా పెరుగుతోంది. కానీ, కొన్నిసార్లు (Wrong UPI Payment) అనుకోకుండా రాంగ్ మొబైల్ నంబర్ లేదా అకౌంట్‌కు డబ్బును పంపిస్తుంటారు. ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా? అయితే భయపడాల్సిన పనిలేదు. మీ డబ్బును తిరిగి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
Read Also : Motorola Edge 50 Ultra : అమెజాన్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్.. డోంట్ మిస్!
ముందుగా ఈ పని చేయండి :
నగదు రాంగ్ అకౌంట్ వెళ్లిందని గుర్తించిన వెంటనే అప్రమత్తం అవ్వండి. సంబంధిత యాప్‌కి (Google Pay, PhonePe, Paytm, BHIM ) ఓపెన్ చేయండి. లావాదేవీ వివరాలకు వెళ్లి “Report an issue” లేదా “Raise complaint” ఆప్షన్ ఎంచుకోండి. రాంగ్ అకౌంట్ పూర్తి వివరాలను నమోదు చేయండి.. స్క్రీన్‌షాట్ కూడా తీసుకోండి.
బ్యాంకును సంప్రదించండి :
యాప్ రెస్పాండ్ కాకపోతే.. మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. వారికి లావాదేవీ ID, తేదీ, టైమ్ ఇవ్వండి. బ్యాంక్ ఫిర్యాదును నమోదు చేసి రాంగ్ అకౌంట్ వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తుంది. అవతలి వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వడానికి అంగీకరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
NPCIకి ఫిర్యాదు చేయండి :
బ్యాంకు లేదా యాప్ నుంచి మీకు పరిష్కారం లభించకపోతే.. మీరు NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వద్ద ఫిర్యాదు చేసుకోవచ్చు. వెబ్‌సైట్ (https://www.npci.org.in/) “Dispute Redressal Mechanism” సెక్షన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. లావాదేవీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇవ్వండి.
పోలీసు ఫిర్యాదు :
ఎవరైనా మీ డబ్బును తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే.. మీరు సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. https://cybercrime.gov.in పోర్టల్‌ను విజిట్ చేయండి. మీ బ్యాంకుకు FIR కాపీని ఇవ్వండి. తద్వారా చట్టపరమైన చర్యలను తీసుకోవచ్చు.
డబ్బు పంపే ముందు రిసీవర్ పేరు, మొబైల్ నంబర్, యూపీఐ ఐడీని ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. QR కోడ్‌ను స్కాన్ చేశాక రిసీవర్ పేరు స్క్రీన్‌పై కనిపిస్తుందో లేదో చెక్ చేయండి. లావాదేవీ రసీదు స్క్రీన్‌షాట్‌ను సేవ్ చేయండి. యూపీఐ యాప్‌లలో “Beneficiary Save” ఫీచర్‌ని ఉపయోగించండి.