Jio Recharge Plans : గేమింగ్ ప్రియుల కోసం 2 కొత్త జియో ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ 5G డేటా, ఫ్రీ BGMI రివార్డ్స్..!
Jio Recharge Plans : జియో గేమింగ్ యూజర్ల కోసం అద్భుతమైన రెండు రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఫ్రీ BGMI రివార్డులతో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా

Jio Recharge Plans
Jio Recharge Plans : మొబైల్ గేమర్స్‌కు గుడ్ న్యూస్.. దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో గేమింగ్ ప్రియుల కోసం రెండు కొత్త అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్‌లు హై-స్పీడ్ డేటాను (Jio Recharge Plans) మాత్రమే కాకుండా ఫ్రీ బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వంటి గేమింగ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
అందులో ప్రధానంగా (BGMI) స్కిన్‌లు, JioGames క్లౌడ్ యాక్సెస్, 500 కన్నా ఎక్కువ ప్రీమియం గేమ్‌లను డౌన్‌లోడ్ చేయకుండానే స్ట్రీమింగ్ అనుమతిస్తుంది. క్రాఫ్టన్ BGMI డెవలపర్ ఇండియా సహకారంతో ఈ ప్లాన్లను జియో తీసుకొచ్చింది.
గేమింగ్ ప్లాన్ బెనిఫిట్స్ :
ఈ రెండు ప్లాన్‌ల ధరలు రూ.495, రూ.545 కాగా 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్నాయి. రూ.495 ప్లాన్ రోజుకు 1.5GB డేటా, అదనంగా 5GB బోనస్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, జియోగేమ్స్క్లౌడ్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.
రూ.545 ప్లాన్‌లో అర్హత కలిగిన యూజర్లకు 2GB రోజువారీ 4G డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు అదే గేమింగ్ పెర్క్‌లు కూడా ఉన్నాయి. జియో అందించే 2 ప్లాన్‌లలో స్పెషల్ BGMI రివార్డ్ కూపన్‌లు ఉన్నాయి.
రివార్డు కూపన్లు ఇలా చూడొచ్చు :
గేమర్లకు బార్డ్స్ జర్నీ సెట్, డెసర్ట్ టాస్క్‌ఫోర్స్ మాస్క్, ట్యాప్ బూమ్ మోలోటోవ్ కాక్‌టెయిల్ వంటి ఫ్రీ ఇన్-గేమ్ ఐటమ్స్ అందిస్తాయి. రివార్డులను క్లెయిమ్ చేసుకునేందుకు వినియోగదారులు గేమింగ్ ప్యాక్‌లలో ఏదైనా రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ తర్వాత కన్ఫార్మేషన్ మెసేజ్ వస్తుంది. రివార్డ్ కూపన్లు (MyJio) యాప్‌లో Profile > Coupons & Winnings కింద అందుబాటులో ఉంటాయి.
Read Also : Motorola Edge 50 Ultra : అమెజాన్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్.. డోంట్ మిస్!
ఈ కూపన్‌లను అధికారిక BGMI వెబ్‌సైట్‌లో ప్లేయర్ క్యారెక్టర్ ID, స్పెషల్ కోడ్ ఉపయోగించి రీడీమ్ చేసుకోవచ్చు. జియోగేమ్స్ క్లౌడ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు లేదా బ్రౌజర్‌లలో హై-ఎండ్ డివైజ్ అవసరం లేకుండా నేరుగా గేమ్‌లు ఆడవచ్చు. ఈ సర్వీసు కోసం జియోగేమ్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. జియో నంబర్‌తో లాగిన్ అవ్వాలి. సబ్‌స్క్రిప్షన్ ఆటోమాటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.