Telugu » Business » Xiaomi 14 Civi Available With Rs 17k Discount During Amazon Great Indian Festival Sale 2025 Sh
Amazon Great Indian Festival Sale : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. షావోమీ 14 Civi ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇలా కొనేసుకోండి!
Amazon Great Indian Festival Sale : అమెజాన్ సేల్ సమయంలో షావోమీ 14 సివి అతి చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 17వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Xiaomi 14 Civi : షావోమీ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అంతులేని ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. వైడ్ రేంజ్ ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందిస్తోంది. హోం అప్లియన్సెస్ నుంచి ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వరకు మీకు ఇష్టమైన వస్తువులను తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.
2/6
ఇప్పుడు షావోమీ 14 సివిపై కూడా ఊహించని డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెషల్ డిజైన్, ఆకట్టుకునే డిస్‌ప్లే, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, మల్టీఫేస్ కెమెరా సెటప్‌తో ప్రత్యేకంగా కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ షావోమీ 14 సివి చౌకైన ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
3/6
షావోమీ 14 సివి అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో షావోమీ 14 సివి రూ.42,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.25,999కి జాబితా అయింది. అంటే.. ఈ-కామర్స్ దిగ్గజం షావోమీ 14 సివిపై రూ.17వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంకా సేవింగ్ కోసం మీ పాత ఫోన్‌తో కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
4/6
షావోమీ 14 సివి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : షావోమీ 14 సివి ఫోన్ 6.55-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. HDR10+, డాల్బీ విజన్, 68-బిట్ కలర్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 3000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
5/6
హుడ్ కింద, షావోమీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.
6/6
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. షావోమీ 14 సివి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. PDAF, OISతో 50MP ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్ వరకు 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డ్యూయల్ 32MP కెమెరాలను కలిగి ఉంది.