×
Ad

Xiaomi 14 CIVI : అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్.. షావోమీ 14 CIVI ఫోన్‌పై రూ. 14వేలు డిస్కౌంట్.. వెంటనే కొనేసుకోండి..!

Xiaomi 14 CIVI : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా షావోమీ 14 CIVI ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఖతర్నాక్ డీల్ ఇలా పొందండి.

Xiaomi 14 CIVI

Xiaomi 14 CIVI : షావోమీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో షావోమీ 14 CIVI ఫోన్ ధర తగ్గింది. గత ఏడాది భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ షావోమీ ఫోన్ అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో (Xiaomi 14 CIVI) సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో లైకా-బ్రాండెడ్ సెన్సార్లు, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉన్నాయి. మీ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. షావోమీ 14 సివి ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

షావోమీ 14 CIVI అమెజాన్ డీల్స్ :
షావోమీ 14 CIVI ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో అసలు లాంచ్ ధర రూ.42,999 నుంచి రూ.28,919కు లభ్యమవుతుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా యూజర్లు అమెజాన్ పే బ్యాలెన్స్‌పై రూ.867 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. షాడో బ్లాక్, మాచా గ్రీన్, క్రూయిజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో షావోమీ 14 సివి కొనుగోలు చేయొచ్చు.

Read Also : Post Office Scheme : మీ జీతం పడిందా? ఈ పోస్టాఫీసు పథకంలో ఒకసారి పెట్టుబడి పెట్టండి చాలు.. ప్రతినెలా రూ. 6వేలు ఆదాయం పొందొచ్చు..!

షావోమీ 14 CIVI స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
షావోమీ 14 CIVI ఫోన్ 6.55-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. బేస్ మోడల్‌లో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

హై-ఆక్టేన్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం అడ్రినో 735 ప్రాసెసర్‌ను కూడా అందిస్తుంది. షావోమీ 14 CIVIలో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో సెన్సార్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. 32MP వైడ్ యాంగిల్ షూటర్, 32MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కలిగి ఉంది. ఈ షావోమీ ఫోన్ 4700mAh బ్యాటరీతో పాటు 67W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది. షావోమీ ఫోన్ 40 నిమిషాల ఛార్జింగ్‌లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. సెక్యూరిటీ బెనిఫిట్స్ కోసం షావోమీ ఫోన్‌లో డిస్‌ప్లే కింద ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.