ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది

రెడ్‌మీ నోట్ 7 కొత్త ఫోన్ భార‌త్ మార్కెట్ల‌లోకి వ‌చ్చేస్తోంది. అదిగో ఇదేనెల‌లో..  లేదు లేదు... వ‌చ్చే నెల‌లో.. అంటూ ఒక‌టే రుమార్స్‌.. అస‌లు.. రెడ్ మీ నోట్ 7 కొత్త స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఇండియా మార్కెట్ల‌లోకి వ‌స్తుంద‌నేదానిపై గంద‌ర‌గోళం నెల‌కొంది.

  • Publish Date - February 14, 2019 / 08:00 AM IST

రెడ్‌మీ నోట్ 7 కొత్త ఫోన్ భార‌త్ మార్కెట్ల‌లోకి వ‌చ్చేస్తోంది. అదిగో ఇదేనెల‌లో..  లేదు లేదు… వ‌చ్చే నెల‌లో.. అంటూ ఒక‌టే రుమార్స్‌.. అస‌లు.. రెడ్ మీ నోట్ 7 కొత్త స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఇండియా మార్కెట్ల‌లోకి వ‌స్తుంద‌నేదానిపై గంద‌ర‌గోళం నెల‌కొంది.

రెడ్‌మీ నోట్ 7 కొత్త ఫోన్ భార‌త్ మార్కెట్ల‌లోకి వ‌చ్చేస్తోంది. అదిగో ఇదేనెల‌లో..  లేదు లేదు… వ‌చ్చే నెల‌లో.. అంటూ ఒక‌టే పుకార్లు.. అస‌లు.. రెడ్ మీ నోట్ 7 కొత్త స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఇండియా మార్కెట్ల‌లోకి వ‌స్తుంద‌నేదానిపై గంద‌ర‌గోళం నెల‌కొంది. కొంద‌రేమో మార్చిలో రిలీజ్ అవుతుందంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ రూమ‌ర్ల‌ల‌న్నీంటికి జియోమీ చెక్ పెట్టేస్తూ రెడ్ మీ నోట్ 7 లాంచింగ్ పై క్లారిటీ ఇచ్చేసింది. రెడ్ మీ నోట్ 7 ప్రో మోడ‌ల్.. ఫిబ్ర‌వ‌రిలోనే ఇండియాలో లాంచ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి చివరి వారంలో రెడ్ మీ కొత్త ఫోన్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు జియోమీ ఇండియా ఎగ్జిక్యూటీవ్ ఎండీ మ‌నూ ట్విట్ట‌ర్ వేదిక‌గా రివీల్ చేశారు. అయితే.. రిలీజ్ కు ముందే రెడ్ మీ నోట్ 7 మోడ‌ల్ ఫీచర్ల‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇప్ప‌టికే రెడ్ మీ ఫోన్ 48 మెగా ఫిక్స‌ల్ కెమెరాతో వ‌స్తోంద‌ని అంద‌రికి తెలిసిందే. రెడ్ మీ నోట్ ఫిబ్ర‌వ‌రి చివరివారంలో లాంచింగ్ అవుతున‌ప్ప‌టికీ.. క‌చ్చిత‌మైన తేదీని జియోమీ ఇంకా రివీల్ చేయ‌లేదు. మ‌రో వారం పది రోజుల్లో ఇండియాలో జియోమీ రెడ్ మీ నోట్ 7 ఫోన్ లాంచింగ్ షురూ అయిన‌ట్టు కంపెనీ రిలీజ్ చేసిన టీజ‌ర్ చూస్తే తెలిసిపోతుంది. అంటే.. ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన భార‌త మార్కెట్ల‌లో రెడ్ మీ నోట్ 7 ప్రో వ‌చ్చేస్తోంద‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది.

ప్ర‌స్తుతం భార‌త స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న త‌రుణంలో జియోమీ రిలీజ్ చేయ‌నున్న రెడ్ మీ నోట్ 7 బిగ్ మార్కెట్ ను సేల్స్ క్రియేట్ చేస్తుంద‌ని మొబైల్ మార్కెట్‌ విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. చైనాలో ముందుగా రెడ్ మీ నోట్ 7 రిలీజ్ చేయ‌గా.. ఇప్ప‌టికే అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. రిలీజ్ అయిన మూడు వారాల్లో 10 ల‌క్ష‌ల యూనిట్ రెడ్ మీ నోట్‌7 స్మార్ట్ ఫోన్లు సేల్ అయిన‌ట్టు జియోమీ ప్ర‌క‌టించింది. చైనా త‌ర‌హాలో భార‌త్ లో రెడ్ మీ నోట్ 7 భారీ సేల్స్ క్రియేట్ చేస్తుంద‌ని జియోమీ అంచ‌నా వేస్తోంది.  
 

చైనా మార్కెట్ల‌లో రెడ్ మీ నోట్ 7  ప్రారంభ ధ‌ర 999 యువాన్ (రూ.10వేల 500). ఈ ఫోన్ లో ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ 3జీబీ.. 32జీబీ ఫీచ‌ర్లు ఉన్నాయి. రెండో వెరియంట్ నోట్ 7 ఫోన్ లో 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజీ.. దీని ధ‌ర రూ.1199 యువాన్ (అంటే.. రూ.12వేల 400) వ‌ర‌కు ఉంటుంది. మూడో వెరియంట్ నోట్ 7 ఫోన్ లో కూడా 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో మార్కెట్ ధ‌ర 1399 యువాన్ (రూ.14వేల 500) వ‌ర‌కు ఉంది. ఈ మూడు రెడ్ మీ నోట్ 7 మోడ‌ల్స్ భార‌త్ మార్కెట్ల‌లోనూ అందుబాటులోకి రానుంది. 

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

Also Read : మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం

Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే

Also Read : తెలుగులో కూడా పేటీఎం సేవలు

Also Read : ZOMATO CHAT: అమ్మతోడు సార్.. మీ డబ్బులు వచ్చేస్తాయ్