Xiaomi YU7 electric
Xiaomi YU7 electric SUV : కొత్త షావోమీ ఎలక్ట్రిక్ కారు వచ్చేసిందోచ్.. తొలి ఎలక్ట్రిక్ SUV షియోమి YU7ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునేలా ఉంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 835 కిలోమీటర్లు ప్రయాణించగలదు. షావోమీ YU7 టాప్ స్పీడ్ గంటకు 253 కి.మీ దూసుకెళ్తుంది. షావోమీ YU7 ఫీచర్లు, రేంజ్, కలర్ వంటి పూర్తి వివరాలను ఓసారి వివరంగా తెలుసుకుందాం.
షావోమీ YU7 పవర్, స్పెసిఫికేషన్లు :
షావోమీ YU7 హైపర్ ఇంజిన్ V6s ప్లస్ ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా 690 PS పవర్, 528Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 22,000rpm వరకు చేరుకుంటుంది.
SUV కేవలం 3.23 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఈ EV టాప్ స్పీడ్ గంటకు 253 కి.మీ. సెగ్మెంటెడ్ మాగ్నెటిక్ స్టీల్ టెక్నాలజీ మోటార్‌తో వస్తుంది. CLTC డ్రైవింగ్ రేంజ్ 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
షావోమీ YU7 సేఫ్టీ ఫీచర్లు :
ఈ EV మోడెనా ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. బాడీ 2200MPa రేటింగ్‌తో అల్ట్రా-హై-స్ట్రెంగ్త్ స్టీల్‌తో స్టీల్ అల్యూమినియం హైబ్రిడ్ డిజైన్ కలిగి ఉంది. ఈ స్టీల్ 24 మిలియన్లకు పైగా ఏఐ సిమ్యూలేషన్స్, 4వేల పరీక్షల ద్వారా తయారైంది.
659mm ఫ్రంట్ క్రంపుల్ జోన్, 1500MPa అండర్ బాడీ క్రాస్‌బీమ్, బుల్లెట్‌ప్రూఫ్ బ్యాటరీ లేయర్ PVC కన్నా 10 రెట్లు స్ట్రాంగ్ ఉంటుంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్ :
50కి పైగా C-NCAP, C-IASI క్రాష్ టెస్టింగ్‌లో పాస్ అయింది. గంటకు 90 కి.మీ వేగంతో బ్యాక్ ఢీకొన్నవే ఎక్కువ ఉన్నాయి. కొలతల విషయానికి వస్తే.. షావోమీ YU7 పొడవు 4999mm, వెడల్పు 1996mm, ఎత్తు 1600mm, వీల్‌బేస్ 3000mm, డిజైన్ రేషియో 3:1 వీల్ టు బాడీ, 2.1:1 వీల్ టు హైట్, 1.25:1 వెడల్పు ఎత్తు కలిగి ఉంది.
Xiaomi YU7 electric
షావోమీ YU7 బ్యాటరీ, రేంజ్ :
షావోమీ YU7 SUV కారు మొత్తం 3 వేరియంట్లలో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు బేస్ మోడల్ 96.3kWh బ్యాటరీతో వస్తుంది. 835 కిలోమీటర్ల CLTC రేంజ్ అందుకోగలదు. ప్రో మోడల్‌లో 96.3kWh బ్యాటరీ ఉంది. 4 వీల్ డ్రైవ్‌తో 760 కి.మీ రేంజ్ అందిస్తుంది. మాక్స్ మోడల్ 101.7kWh బ్యాటరీని కలిగి ఉంది. 4 వీల్ డ్రైవ్‌తో 770 కి.మీ రేంజ్ అందిస్తుంది.
ఛార్జింగ్ టెక్నాలజీ 800V సిలికాన్ కార్బైడ్ ప్లాట్‌ఫామ్ (897V పీక్)ను ఉపయోగిస్తుంది. 5.2C ఛార్జింగ్ స్పీడ్ సపోర్టు ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 12 నిమిషాల్లో 10 శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేయగలదు. 15 నిమిషాలలోపు 620 కి.మీ.ల రేంజ్ అందుకోగలదు.
కనెక్టివిటీ ఫీచర్లు :
షావోమీ YU7 ధర (అంచనా) :
షావోమీ YU7 ఎలక్ట్రిక్ కారు జూలై 2025లో అధికారిక ధర వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం, షావోమీ YU7 అల్లాయ్ మోడల్ ఎమరాల్డ్ గ్రీన్, టైటానియం సిల్వర్, లావా ఆరెంజ్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అంచనాల ప్రకారం.. ప్రారంభ ధర 35వేల డాలర్లు ఉండొచ్చు.
చైనాలో మోడల్ Y కారు ధర 36,400 డాలర్లు ఉంటుంది. లీ జున్ ప్రకారం.. ఈ మోడల్ టెస్లా మోడల్ Y కన్నా 50వేల నుంచి 60వేల యువాన్ (7వేల డాలర్ల నుంచి 8,300 డాలర్లు) వరకు ఉండవచ్చు.