Yamaha Diwali Offers : యమహా దీపావళి స్పెషల్ ఆఫర్లు.. ఎఫ్‌జెడ్, ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్ మోడళ్లపై ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్స్!

Yamaha Diwali Offers : యమహా దీపావళి ఆఫర్‌లలో ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు, తక్కువ డౌన్ పేమెంట్‌తో మరెన్నో ఫైనాన్స్ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

Yamaha Diwali Offers : దీపావళి పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రముఖ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) కంపెనీ 149సీసీ ఎఫ్‌జెడ్ మోడల్ రేంజ్, 125సీసీ ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది.

భారతీయ విభాగంలో ఎఫ్‌జెడ్-ఎక్స్, ఎఫ్‌జెడ్‌యస్-వి3 ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్‌యస్-వి4 ఎఫ్ఐ, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రేజెడ్‌ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ వంటి మోడళ్లపై ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఆఫర్‌లలో ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు, తక్కువ డౌన్ పేమెంట్, ఫైనాన్స్ స్కీమ్‌లు ఉన్నాయి. ఆఫర్ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

Read Also : Top 10 Selling Cars in October : అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. దుమ్ములేపిన మారుతి మోడల్స్..!

* ఎఫ్‌జెడ్-ఎక్స్‌పై రూ. 5వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్.
* ఎఫ్‌జెడ్ఎస్-వి3 ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్‌యస్-వి4 ఎఫ్ఐపై రూ. 3వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్.
* ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రేజెడ్‌ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్‌పై రూ. 3వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్.
* తక్కువ డౌన్ పేమెంట్, ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్స్

Yamaha Diwali offers 

యమహా ఎఫ్‌జెడ్ మోడల్స్ ధరలు :

ఎఫ్‌జెడ్-ఎక్స్ ధర రూ. 1,36,200, రూ. 1,37,200, ఎఫ్‌జెడ్‌యస్-వి3 ఎఫ్ఐ రూ. 1,21,400, రూ. 1,22,400 మధ్య ఉంది. ఎఫ్‌జెడ్‌యస్-వి4 ఎఫ్ఐ ధర రూ. 1,28,900. స్కూటర్లలో, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ రూ. 79,600, రూ. 93,330 మధ్య రేజెడ్‌ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ రూ. 84,730, రూ. 92,330 మధ్య ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ లొకేషన్‌కు సంబంధించినవి గమనించాలి.

యమహా ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో వైజెడ్‌ఎఫ్-ఆర్15 వి4 (155సీసీ), వైజెడ్ఎఫ్-ఆర్15S వి3 (155సీసీ), ఎంటీ-15 వి2 (155సీసీ); ఎఫ్‌జెడ్-ఎక్స్ (149సీసీ), ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ (149సీసీ), ఎఫ్‌జెడ్‌యస్-ఎఫ్ఐ వెర్షన్ 3.0 (149సీసీ), ఎఫ్‌జెడ్‌యస్-ఎఫ్ఐ వెర్షన్ 4.0 (149సీసీ), ఏరోక్స్ 155 (155సీసీ), ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (125సీసీ), రే జెడ్‌ఆర్ఆర్ వంటి స్కూటర్లు 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (125సీసీ) రే జెడ్‌ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (125సీసీ) ఉన్నాయి.

Read Also : Royal Enfield Himalayan Electric : భలే ఉంది భయ్యా బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అదుర్స్.. అడ్వెంచర్ టూర్స్‌కు ఇదే బెస్ట్..!

ట్రెండింగ్ వార్తలు