Yamaha Hybrid Scooters : భలే ఉన్నాయి భయ్యా.. ఒకేసారి 2 కొత్త యమహా హైబ్రిడ్ స్కూటర్లు.. Ray ZR, ఫాసినో ధర, ఫీచర్లు ఇవే..!
Yamaha Hybrid Scooters : యమహా ఇండియా నుంచి రెండు సరికొత్త హైబ్రిడ్ స్కూటర్లు వచ్చేశాయి. రే జెడ్ఆర్, ఫాసినో ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Yamaha Hybrid Scooters
Yamaha Hybrid Scooters : యమహా లవర్స్ కోసం సరికొత్త హైబ్రిడ్ స్కూటర్లు వచ్చేశాయి. భారతీయ మార్కెట్లోకి 125cc హైబ్రిడ్ స్కూటర్ రేంజ్ రే ZR, ఫాసినోలను (Yamaha Hybrid Scooters) అప్‌డేట్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ రెండు స్కూటర్లలో కంపెనీ అనేక మార్పులను చేసింది.
గత మోడల్ కన్నా ఫీచర్లు మెరుగ్గా ఉన్నాయి. ఈ 2 హైబ్రిడ్ స్కూటర్లను కంపెనీ ISG సిస్టమ్, కొత్త డాష్‌బోర్డ్, కలర్ ఆప్షన్‌లతో అప్‌డేట్ చేసింది. ఈ స్కూటర్ల (Yamaha Ray ZR and Fascino) ప్రారంభ ధరలు వరుసగా రూ. 79,340, రూ. 80,750 (ఎక్స్-షోరూమ్)కు లభ్యమవుతున్నాయి.
కొత్త ఫీచర్ అప్‌డేట్ ఏంటి? :
యమహా కొత్త ‘ఎన్‌హాన్స్‌డ్ పవర్ అసిస్ట్’ సిస్టమ్ మెయిన్ అప్‌డేట్.. బ్రాండ్ ప్రకారం.. ముఖ్యంగా వాల్స్ లేదా పిలియన్‌తో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అత్యంత వేగవంతంగా ఉంటుంది. గత మోడల్‌తో పోలిస్తే కంపెనీ ఇంజిన్ మెకానిజం, పవర్ అవుట్‌పుట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సెటప్ హై పర్ఫార్మెన్స్ బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు స్కూటర్లు మెరుగైన ఇంధన సామర్థ్యం, బ్రాండ్ స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) టెక్నాలజీ కలిగి ఉన్నాయి. సైలెంట్ స్టార్ట్, స్టాప్, స్టార్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మెరుగైన మైలేజీని కూడా అందిస్తాయి.
రెండు స్కూటర్ల వేరియంట్లు, ధరలివే :
- మోడల్ ధర (ఎక్స్-షోరూమ్)
- ఫాసినో S125 (కలర్ TFT) : 1,02,790
- ఫాసినో S125 : 95,850
- ఫాసినో 125 : 80,750
- రే ZR స్ట్రీట్ ర్యాలీ 125 : 92,970
- రే ZR 125 : 79,340
కొత్త TFT డిస్‌ప్లే :
యమహా కంపెనీ ఇప్పుడు ఫాసినో S టాప్-స్పెక్ వేరియంట్‌లో TFT కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చేర్చింది. యమహా-కనెక్ట్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను కూడా అందిస్తుంది. ఈ సిస్టమ్ గూగుల్ మ్యాప్స్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. డిస్‌ప్లే రియల్-టైమ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ సమయంలో స్ట్రీట్ పేర్లు మొదలైన ఇతర అలర్ట్స్ కూడా పొందవచ్చు.
కొత్త కలర్ ఆప్షన్లు కూడా :
ఫాసినో S 125 FI హైబ్రిడ్ ఇప్పుడు మ్యాట్ గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. డిస్క్-బ్రేక్ వేరియంట్ మెటాలిక్ లైట్ గ్రీన్ ఫినిషింగ్ కలిగి ఉంది, డ్రమ్-బ్రేక్ వేరియంట్ మెటాలిక్ వైట్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. రే ZR స్ట్రీట్ ర్యాలీ హైబ్రిడ్ మ్యాట్ గ్రే మెటాలిక్ కలర్‌లో అందిస్తోంది. డిస్క్ వేరియంట్ సిల్వర్ వైట్ కాక్‌టెయిల్ షేడ్‌లో అందుబాటులో ఉంది.