Asia Cup 2025 : వైస్ కెప్టెన్ కావడంతో గిల్‌కు తుది జట్టులో చోటు? సంజూ శాంసన్ బెంచీకే పరిమితమా? అగార్కర్ ఏమన్నాడంటే?
ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Asia Cup 2025 Will vice captain Shubman Gill get direct entry into playing XI
Asia Cup 2025 : ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోనే ఆసియా కప్ (Asia Cup 2025 ) బరిలోకి భారత్ దిగనుంది. కాగా.. ఈ జట్టులో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.
దాదాపు ఏడాదిగా శుభ్‌మన్ గిల్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయినప్పటికి అతడికి జట్టులో చోటు దక్కడంతో పాటు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడంతో చాలా మంది ఆశ్చర్చపోయారు. గిల్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపిక చేసినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పడంతో ఇక ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతోంది.
సంజూ బెంచీకే పరిమితమా?
గత కొన్నాళ్లుగా భారత టీ20 జట్టుకు రెగ్యులర్ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు ఉన్నారు. వీరిద్దరు జట్టుకు మంచి ఆరంభాలను అందిస్తున్నారు. ఇప్పుడు గిల్‌ను ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో అతడికి తుది జట్టులోకి తీసుకోవాల్సి పరిస్థితి నెలకొంది.
AJIT AGARKAR ABOUT OPENING COMBINATION:
“Gill and Sanju – two very good opening options to have alongside Abhishek Sharma. Captain & Coach will take the call after reaching Dubai”. pic.twitter.com/brUzyYWuL9
— Johns. (@CricCrazyJohns) August 19, 2025
దీంతో సంజూ, అభిషేక్ శర్మలలో ఒకరు బెంచీకే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే.. అభిషేక్ ఎడమ చేతి వాటం ఆటగాడు కావడంతో అతడి స్థానానికి డోకా లేదు. ఇక ఇద్దరు కుడి చేతి వాటం ఆటగాళ్లు అయిన సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్‌లలో ఒకరు అభిషేక్‌కు తోడుగా ఆడనున్నారు. వైస్ కెప్టెన్ కావడంతో గిల్ తుది జట్టులో ఉంటాడని, సంజూ బెంచీపై పరిమితం కావాల్సి వస్తుందని అంటున్నారు.
దీనిపై అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో స్పందించాడు. ‘మేము అత్యుత్తమ జట్టు కూర్పు పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దుబాయ్ చేరుకున్న తరువాత అక్కడి పిచ్‌లను పరిశీలించిన తరువాత టీమ్ పై ఓ స్పష్టత వస్తుంది. గిల్ గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అలాగే సంజూ శాంసన్ కూడా గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి అభిషేక్ శర్మ తోడుగా రెండు మంచి ఎంపికలు ఉన్నాయి.’ అని అగార్కర్ అన్నాడు.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.