YesBank సంక్షోభం : PhonePe వాడుతున్న వారికి స్వీట్ న్యూస్

  • Publish Date - March 9, 2020 / 01:33 AM IST

Yes Bank బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న PhonePe తీవ్ర ఇబ్బందుల్లో పడింది. గత రెండు రోజులుగా డిజిటల్ చెల్లింపులు చేసే ఈ ప్లాట్ ఫాం (PhonePe) లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఫోన్ పే యాజమాన్యం..భావించి…పలు చర్యలు చేపట్టింది. సేవలను పునరుద్ధరించే పనిలో పడిపోయింది. అందులో భాగంగా ICICI బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఫోన్ పేకు Yes Bank స్థానంలో ICICI డబ్బులను సర్దుబాటు చేయనుంది. 

సరైన సమయంలో ఆదుకున్నందుకు ICICI బ్యాంకుతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు PhnePe కార్యనిర్వాహణ అధికారి సమీర్ నిగమ్ వెల్లడించారు. YesBank సంక్షోభం కారణంగా..ఫోన్ పేతో పాటు మరో 15 థర్డ్ పార్టీ పేమెంట్స్ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ICICI ఒప్పందం కారణంగా..డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు..వాలెట్ సర్వీసులు కూడా తిరిగి అందుబాటులోకి రానున్నాయి. 

ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయిన..YesBankపై RBI మారిటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం రూ. 50 వేలు మాత్రమే డ్రా చేసుకోవాలనే కండీషన్ పెట్టింది. మరోవైపు బ్యాంక్ వ్యవస్థాపకుడైన రాణాకపూర్‌ని అదుపులోకి తీసుకుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌. మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే నిర్ధారణతో అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే అతనిపై సీబీఐ కూడా FIR దాఖలు చేసింది. 

Read More : Yes Bank సంక్షోభం : ఈడీ అదుపులో రాణాకపూర్..ఎన్ని వేల కోట్లు మింగారో!