YouTube Premium Lite
YouTube Premium Lite : యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారతీయ యూజర్ల కోసం యూట్యూబ్ సరికొత్త ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఫుల్ లెవల్ యూట్యూబ్ ప్రీమియం బండిల్‌కు చౌకైన ధరకే పొందవచ్చు. అంటే.. పైసా చెల్లించకుండానే యాడ్ ఫ్రీ వీడియో ప్లేబ్యాక్‌ను యాక్సస్ చేయొచ్చు.
ఈ ప్లాన్ నెలకు రూ. 89 ధర చెల్లిస్తే సరిపోతుంది. యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium Lite) స్టూడెంట్ ప్లాన్ మాదిరిగానే అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే, స్టాండర్డ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మాదిరి కాకుండా ఇందులో యూట్యూబ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే లేదా ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు ఉండవు. ముఖ్యంగా, యూట్యూబ్ ప్రీమియం లైట్ ప్రారంభంలో మార్చి 2025లో అమెరికాలో ప్రవేశపెట్టగా భారత మార్కెట్లో నెలకు 7.99 డాలర్లు (సుమారు రూ. 709)కి అదే బెనిఫిట్స్ అందిస్తుంది. అదే ప్లాన్ యూఎస్‌లో అత్యంత ఖరీదైనది.
భారత్‌లో యూట్యూబ్ ప్రీమియం లైట్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో కొత్త యూట్యూబ్ ప్రీమియం లైట్ ధర నెలకు రూ. 89గా నిర్ణయించింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం స్టూడెంట్ ప్లాన్‌కు సమానమని షేర్ చేసింది. అదనంగా, వార్షిక యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ధర రూ. 1,490కు పొందవచ్చు. అయితే పర్సనల్ ప్లాన్ నెలకు రూ. 149 నుంచి ప్రారంభమవుతుంది. ఐదుగురు సభ్యుల వరకు అదనంగా చేర్చుకునేందుకు అనుమతించే ఫ్యామిలీ ప్లాన్ నెలకు రూ. 299, ఇద్దరు సభ్యుల ప్లాన్ నెలకు రూ. 219 నుంచి అందుబాటులో ఉంది.
యూట్యూబ్ ప్రీమియం లైట్ ఫీచర్లు :
ప్రీమియం లైట్ ప్లాన్ గేమింగ్, ఫ్యాషన్, బ్యూటీ, న్యూస్ వంటి కేటగిరీలలో “most” వీడియోలపై యాడ్ ఫ్రీ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అయితే, “most” అంటే ఏమిటో ప్లాట్‌ఫామ్ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు, యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు వంటి అదనపు ఫీచర్‌లతో పాటు అన్ని కంటెంట్‌లో యాడ్ ఫ్రీ వ్యూను అందిస్తుంది.
యూట్యూబ్ ప్రీమియం లైట్ అనేది యూట్యూబ్ మ్యూజిక్ కన్నా చౌకైన వెర్షన్. ఈ ప్లాన్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలతో సహా అన్ని డివైజ్‌లకు సపోర్టు చేస్తుంది. అయితే, మ్యూజిక్ వీడియోలు, షార్ట్‌లు, బ్రౌజ్ చేస్తున్నప్పుడు లేదా సెర్చ్ చేస్తున్నప్పుడు యాడ్స్ ఇప్పటికీ కనిపిస్తాయని యూట్యూబ్ పేర్కొంది. ప్రీమియంకి బడ్జెట్-ఫ్రెండ్లీ కానీ యూజర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు.