iPhone 16 Pro Max : ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు భయ్యా..!
iPhone 16 Pro Max : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్ ఇలా పొందండి.

iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ పండగ సీజన్ సేల్ ఆఫర్లలో ఖరీదైన ఐఫోన్ చౌకైన ధరకే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎంట్రీ లెవల్ ఫోన్ల నుంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల వరకు అనేక ఆఫర్లను పొందవచ్చు. మీరు ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డిస్కౌంట్ : 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 8GB ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ.1,44,900 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,34,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ ఇంకా, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగిన అన్ని వినియోగదారులు క్యాలెండర్ త్రైమాసికానికి రూ.4వేలు అదనపు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ నేచురల్ టైటానియం, బ్లాక్ టైటానియం అనే రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్‌తో కలిగి ఉంది. ఈ ప్యానెల్ MOHS లెవల్ 4 కలిగిన సిరామిక్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ 6-కోర్ GPUతో పాటు 3nm ప్రాసెస్ ఆధారంగా ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.

పర్ఫార్మెన్స్ పరంగా పాత జనరేషన్ ప్రాసెసర్ ఉన్నప్పటికీ, గేమింగ్ చేస్తున్నా లేదా మల్టీ టాస్కింగ్ చేస్తున్నా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.

ఈ ఐఫోన్ బ్యాక్ కెమెరా వివిధ లైటింగ్ కండిషన్లలో కూడా అద్భుతమైన షాట్‌లను క్యాప్చర్ చేయగలదు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 12MP ఫ్రంట్ స్నాపర్ కూడా తెస్తుంది. 4685mAh బ్యాటరీతో పాటు 23MP మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.