Google Pixel 8a Price : వారెవ్వా.. బ్రహ్మాండమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 8a భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Google Pixel 8a Price : పిక్సెల్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ సరసమైన ధరకే లభిస్తోంది.

Google Pixel 8a Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. వివిధ కేటగిరీల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్, హోం అప్లియన్సెస్ వరకు ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.

మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నా లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికి అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్స్‌లో గూగుల్ పిక్సెల్ 8a భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ సేల్ సమయంలో పిక్సెల్ 8a ఫోన్ రూ.28వేల లోపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

గూగుల్ పిక్సెల్ 8a ఫ్లిప్‌కార్ట్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ రూ.52,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.29,999కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా పిక్సెల్ 8a ఫోన్‌పై రూ.23వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో పాటు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేసినప్పుడు అదనంగా రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ 6.1-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. గరిష్ట ప్రకాశం 2,000 నిట్స్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే.. పిక్సెల్ 8a ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ సెటప్ కలిగి ఉంది. 64MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ కలిగి ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కూడా ఉంది. ఈ పిక్సెల్ ఫోన్ 4,492mAh బ్యాటరీతో వస్తుంది.

గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ బెస్ట్ టేక్, మ్యాజిక్ ఎడిటర్, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి గూగుల్ ఏఐ-ఆధారిత ఫోటో, వీడియో టూల్స్ కూడా ఉన్నాయి. 8× వరకు సూపర్ రిజల్యూషన్ జూమ్‌తో కూడా వస్తుంది.

మ్యాజిక్ ఎరేజర్, నైట్ సైట్, ఫొటో అన్‌బ్లర్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇతర ఫీచర్లలో సర్కిల్ టు సెర్చ్, ఏఐ ఆధారిత పిక్సెల్ కాల్ అసిస్ట్, ఆడియో ఎమోజి తరహా అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.