Zero GST : హెల్త్ ఇన్సూరెన్స్ పై జీరో జీఎస్టీ? వచ్చే నెలలో తేలిపోనుంది.. ఏయే వస్తువులు చౌకగా దొరకనున్నాయంటే? ఫుల్ డిటెయిల్స్..

Zero GST : మోడీ ప్రభుత్వం అతి త్వరలో శుభవార్త చెప్పనుంది. జీరో జీఎస్టీపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏయే వస్తువులు చౌకైన ధరకు లభించనున్నాయంటే?

Zero GST on Health Insurance

Zero GST : వినియోగదారులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీరో జీఎస్టీ విధానం అమల్లోకి రానుంది. వచ్చే సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ (Zero GST) సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో వివిధ వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. జీరో జీఎస్టీ అమల్లోకి వస్తే ముఖ్యంగా సామాన్యులకు భారీగా ఊరట కలగనుంది.

5శాతం శ్లాబ్‌లోకి..? :
జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో జీఎస్టీ రేటుపై తీసుకునే నిర్ణయంతో చాలా వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. నివేదిక ప్రకారం.. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని ఆహార వస్త్ర ఉత్పత్తులను 5శాతం స్లాబ్‌లోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల డిమాండ్‌ తీర్చడం ద్వారా సిమెంట్‌పై పన్ను 28శాతం నుంచి 18శాతానికి తగ్గించవచ్చని నివేదిక పేర్కొంది. తద్వారా వినియోగదారులపై ఖర్చుల భారం తగ్గుతుందని భావిస్తున్నారు.

సాధారణంగా కొన్ని సేవలపై సుంకాలను 18శాతం నుంచి 5శాతానికి తగ్గించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. చిన్న సెలూన్‌లు మినహాయింపులో ఉన్నప్పటికీ, మధ్యస్థ, ఉన్నత స్థాయి సంస్థలు ప్రస్తుతం 18శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉండగా ఈ భారం కూడా వినియోగదారులపైనే మోపాయి.

Read Also : Vodafone Idea : పండగ చేస్కోండి.. Vi స్పెషల్ ఆఫర్ కేక.. రూ. 4,999 ఏడాది ప్లాన్ జస్ట్ రూ.1కే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Zero GST : ఆరోగ్య బీమా పాలసీలపై జీరో పన్ను :

టర్మ్ అష్యూరెన్స్, వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ సున్నాకి తగ్గించాలని ప్రతిపాదించింది. ఇదేగానీ అమల్లోకి వస్తే.. అధిక ప్రీమియం చెల్లించాల్సిన కవరేజీని మరింత సరసమైన ధరలోనే పొందవచ్చు. ఎక్కువమంది బీమా తీసుకునేందుకు ముందుకు వస్తారు.

సెప్టెంబర్ 3 నుంచి 4 తేదీలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు కూడా పాల్గొనున్నాయి. చాలా వస్తువులు, సేవలకు 5శాతం, 18 శాతం, ఎంపిక చేసిన లగ్జరీ వస్తువులకు 40శాతం, తక్కువ స్లాబ్‌లతో మారడంపై కౌన్సిల్ చర్చించనుంది.

పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు 40 శాతం సీలింగ్ పెంచాలని సూచించాయి. కానీ, ఇలా చేస్తే తప్పుడు సంకేతాన్ని పంపినట్టు అవుతుందని, చట్టపరమైన మార్పులు అవసరమని కేంద్రం విశ్వసిస్తున్నట్లు వర్గాలు సూచించాయి.

కేంద్రం ప్రణాళిక ప్రకారం.. చిన్న కార్లు (4 మీటర్ల పొడవు వరకు) 18శాతం పన్ను విధించాలి. పెద్ద వాహనాలు 40శాతం లెవీని ఎదుర్కొంటాయి. ప్రస్తుత 50 శాతం కన్నా తక్కువ (28శాతం జీఎస్టీ ప్లస్ 22శాతం సెస్) ఉన్నాయి. ప్రస్తుత ప్రతిపాదనలన్నీ అమల్లోకి వస్తే వినియోగదారులపై భారీగా పన్నుల భారం తగ్గనుంది.