స్నేహితురాలిపై కారులో అత్యాచారం…..అడ్డుకున్న మహిళపై హత్యాయత్నం

  • Published By: murthy ,Published On : September 7, 2020 / 02:28 PM IST
స్నేహితురాలిపై  కారులో అత్యాచారం…..అడ్డుకున్న మహిళపై  హత్యాయత్నం

Updated On : September 7, 2020 / 3:12 PM IST

ఈ రోజుల్లో గర్ల్ ప్రెండ్ లేని మగవాడు ఉన్నాడంటే వాడ్ని ప్రజలు వింతగా చూస్తారు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆమెను తీసుకుని లాంగ్ డ్రైవ్ లు వెళుతున్న కుర్ర్రాళ్లు సొసైటీలో కోకొల్లలు. కొల్ కత్తాలో గర్ల్ ఫ్రెండ్ ని లాంగ్ డ్రైవ్ కి తీసుకు వెళ్ళిన యువకుడు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. యువతి వేసిన కేకలు విని కారు ఆపాలని యత్నించిన మహిళపైకి కారు పోనిచ్చే సరికి ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిపై పోలీసు స్టేషన్ లోకేసు నమోదయ్యింది.



లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా దాదాపు 2నెలల పాటు ఇళ్లకే పరిమితమయ్యారు.  అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక హోటల్స్ రెస్టారెంట్లు ఒకటొకటిగా తెరుచుకుంటున్నాయి. సెప్టెంబర్ 5 శనివారం రాత్రి కోల్ కతా లోని ఒక యువతి, చాలా రోజుల తర్వాత కలుసుకున్న సందర్భంగా, తన స్నేహితుడితో కలిసి అతని కారులో లాంగ్ డ్రైవ్ కు వెళ్ళింది. కారులో ఆనందపూర్ ప్రాతం దాటి ముందుకు వెళ్లాక…. పెద్దగా జనసంచారం లేని ప్రదేశంలో కారును ఆపాడు.

అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించబోయాడు. ఆమె అభ్యంతరం చెప్పింది. దీంతో ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేయబోయాడు. ఆమె ప్రతిఘటించి …ఇంటికి వెళ్లిపోదామని కారును వెనక్కితిప్పమని కోరింది. ఆమె మాటలను పట్టించుకోకుండా కారును ముందుకు పోనివ్వటం మొదలెట్టాడు. దీంతో ఆమె కారు లోంచి రక్షించమని కేకలు వేస్తూ….అతడితో గొడవ పడుతోంది.



అదే మార్గంలో ప్రయాణిస్తున్న నీలాంజనా ఛటర్జీ దంపతులు ఇది గమనించారు. యువతిని రక్షించటానికి, వారి కారును తీసుకువచ్చి, యువకుడి కారు కంటే కొంత ముందు ఆపారు. నీలాంజనా ఛటర్జీ యువతిని రక్షించటానికి కారు దిగి రోడ్డు కడ్డంగా నిలబడ్డారు. వీరిని చూసి యువకుడు కారు ఆపాడు. కొద్ది క్షణాల్లో కారును ముందుకు పోనిచ్చాడు. కదులుతున్న కారులోంచి తన స్నేహితురాలిని కారులోంచి నెట్టేశాడు. దీంతో నీలాంజనా ఛటర్జీ కారును ఆపటానికి అడ్డం పడ్డారు.
https://10tv.in/tata-nexon-xms-variant-with-electric-sunroof-launched-in-india-prices-start-at-rs-8-36-lakh/
యువకుడు కారును ఆపకుండా ఆమె మీదకు పోనిచ్చాడు. కారును తప్పించుకునే ప్రయత్నం చేయబోగా, ఆమె కాళ్లపై నుంచి కారు దూసుకు వెళ్లింది. ఛటర్జీ భర్త అంబులెన్స్ కోసం ఫోన్ చేయగా …కరోనా భయంతో అంబులెన్స్ డ్రైవర్లు అక్కడకు రావటానికి నిరాకరించారు. ఆతర్వాత ఆనందపూర్ పోలీసుస్టేషన్ కు ఫోన్ చేసి… పోలీసు అంబులెన్స్ ను తెప్పించారు. గాయాల పాలైన చటర్జీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



తన స్నేహితుడిచే లైంగిక వేధింపులకు గురై, స్వల్ప గాయాలైన యువతికి ప్రాధమికి చికిత్స చేసి ఇంటికి పంపించారు. కాగా… పారిపోయిన యువకుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయమని ఛటర్జీ భర్త కోరగా…. పోలీసులు నిరాకరించారు. అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.