Health tips: 20-20-20 రూల్ మ్యాజిక్.. కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చునేవారికి అద్భుతమైన ఆప్షన్.. ఇలా చేస్తే హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు
ప్రజెంట్ జనరేషన్ లో చాలా మందికి కంప్యూటర్ ముందు గంటల తరబడి(Health tips) కూర్చొని పనిచేయడం అలవాటుగా మారిపోయింది.

Health Tips: People who work a lot in front of the computer should do this to relax
Health tips: ప్రజెంట్ జనరేషన్ లో చాలా మందికి కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చొని పనిచేయడం అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఐటీ, డేటా ఎంట్రీ, డిజైన్, కంటెంట్ క్రియేషన్ వంటి పని చేసే వారు రోజుకు 8 నుంచి 10 గంటలపాటు స్క్రీన్ ముందు గడుపుతున్నారు. ఇలా గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాంటి సమయంలో మైండ్ ను రిలాక్సేషన్(Health tips) చేసే కొన్ని రకాల పనులు అవసరం. మరి ఆ పనులు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Banana Disadvantages: రోజూ అరటిపండు తింటున్నారా? షుగర్ వచ్చే ప్రమాదం ఉంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
1.కళ్ళు మూయడం, దీర్ఘ శ్వాస:
కంప్యూటర్ ముందు పని చేస్తున్నప్పుడు గంటకు ఒకసారి 2 నుంచి 5 నిమిషాల పాటు కళ్లను మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది మెదడుకు విశ్రాంతిని కలిగించి కళ్లపై పడే ఒత్తిడిని తగ్గించటంలో సహాయపడుతుంది.
2.స్ట్రెచింగ్ వ్యాయామాలు:
చేతులు, భుజాలు, మెడ, కాళ్ళకు చిన్న స్ట్రెచింగ్ చేయడం వల్ల నరాలు నిశ్చలంగా ఉండకుండా ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని అందించడంతో పాటు, వెన్నెముక, మణికట్టు సమస్యలను నివారించగలదు.
3.20-20-20 రూల్ పాటించాలి:
కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేసేవారు ప్రతీ 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల కళ్ల ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇది ఐ స్ట్రెయిన్ తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
4.నడవడం, పాదాల వ్యాయామం:
చిన్నపాటి బ్రేక్ తీసుకొని ఆఫీస్/ఇంట్లో కొన్ని నిమిషాలు నడవడం చాలా మంచిది. ఇది శరీర రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చిన్నగా కాళ్ళను ఊపడం, చాపడం వంటివి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అందుతాయి.
5.ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్:
రోజూ పని మధ్యలో 5 నిమిషాల పాటు శాంతంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల గణనీయమైన ఫలితాలు అందుతాయి.