BAFTAS 2024 : మరోసారి అంతర్జాతీయ వేదికపై దీపికా పదుకోన్..

దీపికా పదుకోన్ ప్రస్తుతం క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. అంతర్జాతీయ వేదికపై మరో ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.

BAFTAS 2024 : మరోసారి అంతర్జాతీయ వేదికపై దీపికా పదుకోన్..

BAFTAS 2024

Updated On : February 14, 2024 / 2:31 PM IST

BAFTAS 2024 : బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కు మరో అరుదైన అవకాశం వరించింది. అంతర్జాతీయ వేదికపై భారీ అవార్డుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు.

Seerat Kapoor : షార్ట్ గౌనులో సీరత్ కపూర్ స్టన్నింగ్ లుక్స్..

లండన్ వేదికగా ఫిబ్రవరి 18న 77వ బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) వేడుక గ్రాండ్‌గా జరగబోతోంది. దీపికా పదుకోన్ ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యహవరించనున్నారు. సాకర్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్, హాలీవుడ్ నటి కేట్ బ్లంచెట్‌లతో కలిసి వేదికను పంచుకోబోతున్నారు దీపికా. ఈ కార్యక్రమం లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో జరగబోతోంది. బ్రిటిష్ సినిమాలతో పాటు పలు అంతర్జాతీయ సినిమాలకు ఈ కార్యక్రమంలో అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఈ వేడుకలు లయన్స్ గేట్ ప్లేలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

Hari Hara Veera Mallu : శివరాత్రికి ‘హరిహర వీరమల్లు’ స్పెషల్ ప్రోమో.. రిలీజ్ డేట్‌ని కూడా..

గత సంవత్సరం ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ వేదికపై పరిచయం చేసి భారతీయులంతా గర్వపడేలా చేసారు దీపికా. మరో ప్రతిష్టాత్మక కార్యక్రమంలో హోస్ట్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారామె. ఇటీవలే దీపిక-హృతిక్ రోషన్ జంటగా నటించిన ‘ఫైటర్’ సినిమా రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటించారు. దీపికా తరువాత ప్రాజెక్టు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘కల్కి 2898 AD’. ఈ మూవీలో ప్రభాస్‌కి జోడీగా నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ మే 9, 2024 న థియేటర్లలోకి రాబోతోంది.