ప్రణయ్ హత్య కేసులో 1200 పేజీల ఛార్జ్‌ షీట్‌..సంచలన విషయాలు వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 1200 పేజీలతో కూడిన ఛార్జ్‌ షీట్‌ ను పోలీసులు నల్గొండ కోర్టులో దాఖలు చేశారు.

  • Publish Date - March 10, 2020 / 07:08 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 1200 పేజీలతో కూడిన ఛార్జ్‌ షీట్‌ ను పోలీసులు నల్గొండ కోర్టులో దాఖలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 1200 పేజీలతో కూడిన ఛార్జ్‌ షీట్‌ ను పోలీసులు నల్గొండ కోర్టులో దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. 120 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్న పోలీసులు… ఫోరెన్సిక్ రిపోర్టును సైతం పొందుపర్చారు. మరోవైపు ఈ కేసులో A-1గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ విషయాన్ని పోలీసులు కోర్టుకు తెలిపారు. (మారుతీరావు మృతికి ఆస్తి తగాదాలే కారణమా? )

ప్రణయ్ హత్య కేసు విచారణ ఈనెల 23కి వాయిదా పడింది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. సుభాష్ శర్మ, అస్గర్, అలీ, అహ్మద్ బారీ, కరీం, శివను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఏ1 గా ఉన్న మారుతీరావు మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరపు ఒక మెమో ఇచ్చారు. ఏ1 ఉన్న మారుతీరావు చనిపోయినట్లు దానికి సంబంధించి ఆధారాలు డెత్ సర్టిఫికెట్ ను కోర్టు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కొంత గడువు కావాలని అడగడంతో ఈ నెల 23 వరకు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సందర్భంలో 1200 పేటీల ఛార్జీషీట్ కు సంబంధించి గడువు ఇచ్చినట్లు సమాచారం.

నిందితులందరూ వస్తేనే ఛార్జీ షీట్ లో ఫ్రేమ్ చేయడానికి వీలుంటుంది. ఎలాంటి పాత్ర ఉందంటూ అభియోగాల నమోదు ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా వాయిదా పడింది. మారుతీరావు చనిపోవడం, శ్రవణ్ తల కొరివి పెట్టడంతో తాను కోర్టుకు హాజరు కాలేనని కోర్టు చెప్పారు. మొత్తం ఎనిమిది మందిలో మిగిలిన ఆరుగురు నిందితులు హాజరయ్యారు. 

ఏ2 గా సుభాష్ శర్మ.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు నడుమ కోర్టుకు తీసుకొచ్చారు. అస్గర్ అలీని జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. వీరిద్దరినీ కోర్టు ముందు హాజరుపర్చారు.

ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నిన్న ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చిన మారుతీరావు… విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే… దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావుది ఆత్మహత్యా..హత్యా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆత్మహత్య చేసుకుంటే పాయిజన్‌ బాటిల్ ఎందుకు లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. మారుతీరావు మృతదేహం లభించిన గదిలో ఆనవాళ్లు దొరకలేదు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలోనూ కారణాలు బయటపడలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మారుతీరావు గదిలో లభించిన లేఖలో చేతిరాత ఆయనదా..? కాదా? తేల్చేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

See Also | YesBank కస్టమర్స్ NEFT, IMPS ద్వారా డబ్బు చెల్లింపులు చేసుకోవచ్చు