Abdullapurmet Naveen Case : నవీన్ హత్య కేసు.. హరిహర కృష్ణకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు

అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఫ్రధాన నిందితుడు హరిహర కృష్ణకు న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది.

Abdullapurmet Naveen Case : అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఫ్రధాన నిందితుడు హరిహర కృష్ణకు న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది. వారం రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు హరిహర కృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. హరిహర కృష్ణకు జడ్డీ జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. వారం రోజుల కస్డడీలో విచారణలో పోలీసులు మరికొన్ని కీలక ఆధారాలను సేకరించారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ కూడా చేశారు. హరిహర కృష్ణ ఇచ్చిన ఆధారాలతో అతడు స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారికను పోలీసులు అరెస్టు చేశారు. హరిహర కృష్ణకు న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.

మంగళవారం (మార్చి7,2023)న నవీన్ హత్య కేసులో నిందితులు హసన్, నిహారికకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో హసన్, నిహారికను పోలీసులు రిమాండ్ కు తరలించారు. హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించగా నిహారికను చంచల్ గూడ జైలుకు తరలించారు. రాత్రి పొద్దు పోయాక నిందితులు హసన్, నిహారిక వనస్థలీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం హయత్ నగర్ జడ్జీ నివాసానికి తరలించారు. దీంతో న్యాయమూర్తి ఇద్దరికీ కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. నవీన్ హత్య కేసులో ఏ-1గా హరిహర కృష్ణ ఉండగా, ఏ-2గా హసన్, ఏ-3గా నిహారికను చేర్చారు.

Naveen Case : నవీన్ హత్యకు ప్రధాన కారణం అదే.. 3 నెలలు వెయిట్ చేసి మరీ లేపేశాడు

ఇప్పటికే గత నెల (ఫిబ్రవరి) 24న హరిహర కృష్ణ అరెస్టు కావడంతో రిమాండ్ లో ఉన్నాడు. పోలీస్ కస్టడీలో అతను చెప్పిన సమాధానం ఆధారంగా హసన్, నిహారికను పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ హత్యపై ఎల్ బీ నగర్ డీసీపీ సాయిశ్రీ కీలక విషయాలు వెల్లడించారు. హత్యకు ముందు ఇద్దరికీ ప్రమేయం లేదని చెప్పారు. నవీన్ ను హత్య చేశాక హరిహర కృష్ణ హసన్ ఇంటికి వెళ్లాడని తెలిపారు. హసన్ వద్దన్నా.. అతని ఇంట్లో ఉండి హసన్ బట్టలు వేసుకుని ఉదయం వెళ్లి పోయాడని డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నవీన్ ట్రయాంగిల్ మర్డర్ కేసులో అనూహ్య మలుపు తీసుకుంది.

10 రోజులపాటు పోలీసుల విచారణలో ఎలాంటి స్పష్టత ఇవ్వని నిందితుడు హరిహర కృష్ణ ఎట్టకేలకు నోరు విప్పాడు. తన ప్రియురాలు నిహారిక కోసమే హత్య చేసినట్లు పోలీసు కస్టడీలో తెలిపారు. దీంతో నిహారికతోపాటు హరిహర కృష్ణ స్నేహితుడు హసన్ ను ఈ కేసులో పోలీసులు నిందితులుగా చేర్చారు.
నవీన్ హత్య కేసులో ఏ-1గా నవీన్, ఏ-2గా హసన్, ఏ-3గా నిహారిక ఉన్నారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. హత్యకు ముందు ఇద్దరికీ ప్రమేయం లేదని చెప్పారు. హత్య జరిగిన తర్వాత నిహారిక 1500 రూపాయలు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసిందని నిర్ధారించారు.

Abdullapurmet Naveen Case : దోషులకు ఉరి శిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటాం : నవీన్ తండ్రి శంకర్ నాయక్

నవీన్ హత్య తర్వాత ఘటనా స్థలానికి హరిహర కృష్ణ, నిహారిక కలిసి వెళ్లారు. అక్కడ ఓ రెస్టారెంట్ లో భోజనం చేశారని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. హసన్ కూడా నవీన్ హత్య స్పాట్ కు వెళ్లాడని చెప్పారు.
నిహారిక ఫోన్ లోని డేటాను ఆమెనే డిలీట్ చేశారని, ఎవిడెన్స్ టాంపరింగ్ కు పాల్పడ్డారని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. నవీన్ హత్య జరిగిన తర్వాత నిందితుడు హరిహర కృష్ణకు అతని స్నేహితుడు హసన్ షెల్టర్ ఇచ్చాడు. రక్తపు బట్టలు ఆ ఇంట్లోనే మార్చుకున్నాడు. ఆ తర్వాత హసన్ బట్టలు వేసుకున్నాడు. ఉదయం వెళ్లిపోయాడని డీసీపీ సాయిశ్రీ చెప్పారు. నవీన్ ను హరిహర కృష్ణ ఒక్కడే హత్య చేశాడని, మృతదేహాన్ని దహనం చేసేందుకు హసన్ సహకరించాడని పోలీసులు తేల్చారు.

ఫిబ్రవరి 17న నవీన్ హత్య కాగా, ఫిబ్రవరి 24న హరిహర కృష్ణ అరెస్టు అయ్యారు. 10 రోజుల తర్వాత కస్టడీలో హరిహర కృష్ణ నోరు విప్పడంతో హసన్, నిహారికలను పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను హరిహర కృష్ణ హత్య చేశాడు. నవీన్ కనిపించకపోవడంతో స్నేహితులు తన తండ్రికి సమాచారం ఇచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన సమయంలో తండ్రి సూచనతో ఫిబ్రవరి 24న హరిహర కృష్ణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ మరుసటి రోజు అతన్ని రిమాండ్ కు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు