విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటనలో అరెస్ట్ అయిన కంపెనీ ప్రతినిధులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. జూమ్ మ్యాప్ ద్వారా నిందుతులను విచారించిన తర్వాత మెజిస్ట్రేట్ వారికి ఈ నెల 22వరకు రిమాండ్ విధించింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో కంపెనీ సీఈఓతో సహా 12 మందిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మంగళవారం అరెస్టు చేసి బుధవారం ఉదయం కోర్టు ఎదుట హాజరు పరిచామని తెలిపారు. మేజిస్ట్రేట్ ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారని తెలిపారు. సుమారు 300 పైగా విట్ నెస్ లను విచారించామని, ఇంకా చాలా మందిని విచారణ చేయాల్సివుందన్నారు. స్వతంత్రంగా తమ విచారణ కొనసాగిందన్నారు. దీనికి టెక్నికల్ అంశాలు ముడిపడి ఉన్నాయని కాబట్టి హైపవర్ కమిటీలో అంతర్భాగం వారు నివేదికలు కోరారని తెలిపారు.
304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసు చాలా తీవ్ర తరమైన కేసు అని, ఏడేళ్ల పైగా శిక్ష పడే కేసులని, వాటి ప్రకారం వీరిని అరెస్టు చేశామని తెలిపారు. 338, 337, 286 ఐపీసీ సెక్షన్లు ఉన్నాయని అంటే ఎవరు దేనికి లైవ్ బుల్ అవుతారు, ఎంతవరకు అవుతారో చూసి తర్వాత విచారణ చేసిన తర్వాత నిర్దారణ చేయాల్సివుంటుందన్నారు. సెషన్స్ కోర్టు స్థాయిలో విచారణ అయ్యే సెక్షన్లను పెట్టామని తెలిపారు. ఎవరిదైనా పాత్ర ఉంటే వారిని వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు.