Dehradun : తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని సోదరిని హత్య చేసిన సోదరులు

తక్కువ కులానికి  చెందిన వ్యక్తితో ప్రేమాయణం నడిపిందని ఒక యువతిని ఆమె అన్నదమ్ములిద్దరూ వదినతో కలిసి హతమార్చిన ఘటన డెహ్రాడూన్ లో చోటు  చేసుకుంది.

Dehradun : తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని సోదరిని హత్య చేసిన సోదరులు

Dehradun Teen girl Murder

Updated On : December 26, 2021 / 4:16 PM IST

Dehradun :  తక్కువ కులానికి  చెందిన వ్యక్తితో ప్రేమాయణం నడిపిందని ఒక యువతిని ఆమె అన్నదమ్ములిద్దరూ వదినతో కలిసి హతమార్చిన ఘటన డెహ్రాడూన్ లో చోటు  చేసుకుంది.

డెహ్రాడూన్ జిల్లాలోని సోడా సరోలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో డిసెంబర్ 20వ తేదీన ఒక కుళ్లిపోయిన స్ధితిలో ఉన్న యువతి(18)  మృతదేహాన్ని  పోలీసులు కనుగొన్నారు. ఆమె అప్పటికి చనిపోయి నెల రోజులైనట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు  పంపించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఆమెను ఎవరు చంపి అక్కడకు తీసుకువచ్చారనే దానికోసం దాదాపు 60 రిసార్ట్ లు…. 150 సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని తనిఖీ చేయగా పోలీసులకు ప్రాధమిక సాక్ష్యాధారాలు లభించాయి. దీంతో వారు కేసును చేధించగలిగారు. మృతురాలు   తన తమ్ముడితో కలిసి బీహార్ నుంచి డెహ్రాడూన్ వచ్చినట్లు కనుగొన్నారు.

బీహార్‌లోని   మోతీహారి గ్రామానికి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు.  తన సోదరినితీసుకుని  డెహ్రాడూన్ వచ్చాను అని.. అక్కడ  అన్న, వదినలతో కలిసి నవంబర్ 6న గొంతుకోసి హత్య చేసి డెహ్రాడూన్ అటవీ ఫ్రాంతంలోపడేసినట్లు ఒప్పుకున్నాడు.
Also Read : Siddipet District : అనుమానంతో భార్యపై వేధింపులు-కుమారుడితో సహ తల్లి ఆత్మహత్య
పోలీసులు డెహ్రాడూన్ లోని అతని అన్న వదినలను అదుపులోకి తీసుకోగా వారుకూడా నేరాన్ని అంగీకరించారు. గ్రామంలో తక్కువ కులానికి చెందిన వ్యక్తితో యువతి ప్రేమ వ్యవహారం నడపటమే హత్యకుకారణమని తేలింది. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసుదర్యాప్తు ముమ్మరం చేశారు.