Stray Dog Attack: రాజధానిలో దారుణ ఘటన.. వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి

ఆనంద్ శరీరంపై జంతువులు భీకరంగా దాడి చేసిన గాయాలు ఉన్నాయి. అతడి శరీరం మొత్తం తూట్లు పొడిచినట్టుగా కొరికేశాయి. కుక్కలతో పాటు పందులు, మేకల దాడి కూడా జరిగి ఉంటుందని స్థానికులు పోలీసులతో అన్నారు. మృతదేహాన్ని సఫ్దార్‭గంజ్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు

Stray Dog Attack: దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ములు కుక్కల దాడికి గురై మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు ఆనంద్ (7), ఆదిత్య (5). ముందుగా ఆనంద్ కనిపించడం లేదని వసంత్ కుంజ్ ప్రాంతం పోలీసులకి స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చింది. అయితే వెంటనే ఒక టీం రంగంలోకి దిగి, తప్పిపోయిన బాలుడి తల్లి సహాయంతో జుగ్గి జంగల్(తప్పిపోయిన చిన్నారి కుటుంబం నివాసం ఉండే ప్రాంతం)లో సోదా నిర్వహించారు. ఇలా రెండు గంటల పాటు సోదా చేశాక, విగత జీవిగా పడి ఉన్న ఆనంద్ కనిపించాడు.

PM security breach: మరోసారి తెరపైకి పీఎం భద్రతా లోపం.. చర్యలపై పంజాబ్‭ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రం

ఆనంద్ శరీరంపై జంతువులు భీకరంగా దాడి చేసిన గాయాలు ఉన్నాయి. అతడి శరీరం మొత్తం తూట్లు పొడిచినట్టుగా కొరికేశాయి. కుక్కలతో పాటు పందులు, మేకల దాడి కూడా జరిగి ఉంటుందని స్థానికులు పోలీసులతో అన్నారు. మృతదేహాన్ని సఫ్దార్‭గంజ్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇక ఇది జరిగిన రెండు రోజులకు ఆనంద్ తమ్ముడు అయిన ఆదిత్య సైతం కుక్కల దాడిలో మరణించాడు. కుటుంబ సభ్యులు తమ బంధువులను పంపించడానికి వెళ్లిన క్రమంలో ఆదిత్య వెనుకబడి పోయాడు. అంతలోనే అతడిని వీధి కుక్కలు చుట్టుముట్టాయి. తీవ్ర గాయాలైన ఆదిత్యను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

MLA Sandra Venkata Veeraiah: తప్పుడు ఆరోపణలతో తండ్రిలాంటి కేసీఆర్ ని విమర్శిస్తే సహించం: ఎమ్మెల్యే సండ్ర

ట్రెండింగ్ వార్తలు